రాష్ట్రీయం

అభ్యర్థుల ఎంపికపై సీఎం కసరత్తు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఫిబ్రవరిలో వెలువడే అవకాశం ఉండటంతో టీడీపీ అభ్యర్థుల ఎంపికపై పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కసరత్తు ప్రారంభించారు. జిల్లాల వారీగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేశారు. సర్వే బృందాలతో పాటు పార్టీ అంతర్గతంగా తెప్పించుకున్న నివేదికల ఆధారంగా అభ్యర్థుల ఎంపికకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ప్రస్తుతం ఆయన అనంతపురం జిల్లాపై దృష్టి సారించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులతో స్వగ్రామం వెళ్లిన చంద్రబాబు మంగళవారం రాత్రి తిరిగి ఉండవల్లి చేరుకున్నారు. అప్పటి నుంచి అభ్యర్థుల ఎంపికకు కసరత్తు ప్రారంభించారు. ఆంతరంగికులతో మంతనాలు సాగించారు. బుధవారం కూడా ఎవరికీ అప్పాయింట్‌మెంట్ ఇవ్వకుండా పార్టీలోని కీలక నాయకుల జాబితాతో ఎంపిక ప్రక్రియపై దృష్టి సారించారు. ఇప్పటికే చిత్తూరు, కడప జిల్లాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక పూర్తిచేసి ఒక అవగాహనకు రాగా, తాజాగా అనంతపురం జిల్లాపై దృష్టి సారించారు. ఇప్పటికే తాను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండనని ఎంపీ జేసీ దివాకరరెడ్డి ప్రకటించి, తన స్థానంలో తన కుమారుడు పవన్ రెడ్డి, జేసీ ప్రభాకర రెడ్డి బదులుగా ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి పోటీ చేస్తారని ప్రకటించారు. ఈనేపథ్యంలో జేసీ సోదరులు గురువారం ముఖ్యమంత్రిని కలిశారు. రానున్న ఎన్నికల్లో పోటీపై అభిప్రాయాలను తెలుసుకున్నారు.
కేటీఆర్, జగన్ భేటీపై చర్చ
వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు భేటీపై అందుబాటులో ఉన్న మంత్రులతో గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్చించారు. టీఆర్‌ఎస్, వైకాపా మధ్య ఉన్న ముసుగు ఈ భేటీతో తొలగిందన్న అభిప్రాయాన్ని సీఎం వ్యక్తం చేసినట్లు తెలిసింది. సమావేశంలో పాల్గొన్న మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నారాయణ, కాలవ శ్రీనివాసులు, గంటా శ్రీనివాసరావులతో తాజా రాజకీయ పరిస్థితులను చర్చించి వారి సలహాలు, సూచనలు తీసుకున్నారు.