రాష్ట్రీయం

గులాబి గూటికి వంటేరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సొంత నియోజకవర్గం గజ్వేల్ నుంచి రెండు పర్యాయాలు ప్రత్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన కాంగ్రెస్ నాయకుడు వంటేరు ప్రతాప్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరికకు రంగం సిద్ధమైనట్టు సమాచారం. సీఎం కేసీఆర్ సమక్షంలో ఆయన గులాబి కండువ కప్పుకోనున్నట్టు గురువారం శాసనసభ ఆవరణలో ప్రచారం గుప్పుమంది. అయితే టీఆర్‌ఎస్ వర్గాలు ధ్రువీకరించకపోయినప్పటికీ వంటేరు కుమారుడే ఈ విషయాన్ని మీడియాకు లీక్ చేసినట్టు తెలిసింది. ఇలా ఉండగా వంటేరు ప్రతాప్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరుతామన్నా చేర్చుకునేది లేదని ఆ పార్టీకి చెందిన మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌లో వంటేరు చేరబోతున్నట్టు ఆయనంతట ఆయనే పుకార్లు పుట్టించారు తప్ప ఈ అంశంపై తమ పార్టీలో ఎలాంటి చర్చ జరుగలేదనీ, పార్టీలోకి ఎవరూ ఆహ్వానించలేదని ప్రభాకర్‌రెడ్డి ఖండించడం కొసమెరుపు.