రాష్ట్రీయం

తిరుపతి రైల్వేస్టేషన్‌కు కొత్త శోభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: తిరుపతి రైల్వే స్టేషన్‌లో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని 2020 నాటికి తిరుపతి రైల్వే స్టేషన్ అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకుంటుందని దక్షిణ మధ్య రైల్వే చైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ చెప్పారు. గురువారం సాయంత్రం తిరుపతి రైల్వే స్టేషన్ ప్రధాన ద్వారం వద్ద రూ. 20లక్షలతో రూపొందించిన 100 అడుగుల జాతీయ జెండాను ఆయన పాకాల ట్రాక్ ఉమెన్ ఎం.వెనె్నల, తిరుపతి పాయింట్స్ ఉమెన్ ఎం.అవంతి, ఆర్‌పిఎఫ్ మహిళ హెడ్ కానిస్టేబుల్ ఎర్. ఎన్. మహేశ్వరి చేతుల మీదుగా ప్రారంభించారు. ప్రయాణిలకు సౌకర్యార్థం రైల్వే శాఖ ఏర్పాటు చేసి రైల్ సతీ మొబైల్ యాప్‌ను ప్రారంభించారు. ఇప్పటికే అంతర్జాతీయ రైల్వే స్టేషన్ పనులు ప్రారంభం అయ్యాయని వివరించారు. తిరుపతి రైల్వే స్టేషన్‌లో ఏర్పాటు చేస్తున్న ఎగ్జిక్యూటివ్ ఎయిర్ కండిషన్ లాన్జ్ ప్రపంచ ఉన్నత ప్రమాణాలతో ఏర్పాటు చేసిన ఫైవ్ స్టార్ సౌకర్యమని అన్నారు. తిరుపతి రైల్వే స్టేషన్ పరిశుభ్రంగా ఉంచడంలో తిరుపతి అందిస్తున్న చేయూతను అభినందించారు. ఈకారణంగానే దేశంలోని రైల్వే స్టేషన్ తిరుపతి రెండో ర్యాంకుతో గుర్తింపు పొందిందన్నారు. తిరుపతి రైల్వే స్టేషన్లో మరో రెండు అదనపు ప్లాట్‌ఫాంలు ఏర్పాటు చేస్తామని, తిరుచానూరు రైల్వే స్టేషన్ మరో గొప్ప రైల్వే స్టేషన్‌గా నిలువనుందన్నారు. రూ. 500 కోట్లతో తిరుపతి రైల్వే స్టేషన్‌ను అల్ట్రామోడల్ రైల్వే స్టేషన్‌గా తీర్చిదిద్దునున్నట్లు చైర్మన్ చెప్పారు. దేశంలోని 6100 రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు వైఫై సౌకర్యం కల్పించామన్నారు. దక్షిణ మధ్య రైల్వేల పరిధిలో సికింద్రాబాద్, హైదరాబాద్, కాచీగూడ, విజయవాడలతోపాటు తిరుపతిలోకూడా త్రివర్ణ పతాకాన్ని ఏర్పాటు చేశామన్నారు. డిజిటల్ ఇండియా మిషన్‌లో భాగంగా గుంతకల్ డివిజన్‌లో ప్రయాణికుల సౌకర్యార్థం మొబైల్ యాప్ రైల్ సతీని ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు. దీనివల్ల ఇండోర్ నావిగేషన్ తిరుపతి రైల్వే స్టేషన్‌కు వచ్చినట్లయ్యిందన్నారు. అంతేకాకుండా ప్రయాణికులకు రైళ్ల రాకపోకలు, సీటు కేటాయింపులు, పిఎన్‌ఆర్, స్టాటస్ వంటి అనేక అంశాలను ప్రయాణికులు తమ మొబైల్ ద్వారానే తెలుసుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో తుడా చైర్మన్ నరసింహ యాదవ్, మాజీ ఎంపీ వరప్రసాద్, గుంతకల్ డిఆర్‌ఎం విజయ్‌ప్రతాప్ సింగ్, సీనియర్ డీసీఎం ప్రశాంత్, తదితరులున్నారు.