రాష్ట్రీయం

కాంగ్రెస్ పొత్తుతో బాబు సాధించేదేమిటి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, జనవరి 18: దేశాన్ని అన్నిరకాలుగా భ్రష్టుపట్టించిన కాంగ్రెస్ పార్టీతో పొత్తుపెట్టుకుని చంద్రబాబునాయుడు ఈ రాష్ట్రానికి సాధించేదేమిటి అని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ప్రశ్నించారు. భారతీయ జనతా పార్టీ కడప శాఖ ఆధ్వర్యంలో సీమ జిల్లాల పోలింగ్ కేంద్రాల పర్యవేక్షకుల సమావేశం శుక్రవారం కడప నగరంలోని కందుల ఎస్టేట్‌లో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిధిగా హాజరైన రాజ్‌నాథ్‌సింగ్ ప్రసంగిస్తూ కాంగ్రెస్ పార్టీ దుర్మార్గాన్ని వ్యతిరేకిస్తూ ఎన్టీ రామారావు ప్రాంతీయ పార్టీ పెట్టి జాతీయ నాయకులుగా ఎదిగారన్నారు. అలాంటి నేత ఆశయాలను చంద్రబాబు పట్టించుకోకుండా అదే కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపడం ఆ నేతకే అవమానమన్నారు. అవినీతి
అక్రమాలతో 50 ఏళ్లపాటు సుదీర్ఘంగా పాలించిన కాంగ్రెస్ దేశాన్ని భ్రష్టుపట్టించిందన్నారు. అలాంటి పార్టీతో చేతులు కలిపిన ఏ పార్టీ బతికిబట్టకట్టలేదని రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దిన ఆంధ్రుడిగా కీర్తిపొందిన దివంగత ప్రధాని పీవీ నరసింహరావు చనిపోతే ఆయన పార్థివ దేహాన్ని పార్టీ కార్యాలయంలోకి కూడా రానివ్వని కాంగ్రెస్ పార్టీ దుష్ట నిర్ణయాన్ని ప్రజలు గమనించారన్నారు.
రాష్ట్ర విభజన చట్టంలోని అంశాల్లో 80 శాతం హామీలను ఇప్పటికే పూర్తి చేశామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెబుతున్న మాటల్లో వాస్తవం లేదన్నారు. రాష్ట్రం అభివృద్ధికి సంబంధించి కేంద్రం విడుదల చేసిన నిధుల సమాచారం ఇవ్వలేదన్నారు. కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు బాబు సహకరించలేదని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేకహోదా పేరుతో కేంద్ర ప్రభుత్వం, మోదీపై విమర్శలు చేయడం శోచనీయమన్నారు. రాష్ట్ర ప్రగతికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. అన్ని రకాలుగా చేయూతనిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని విమర్శించారు. ఇద్దరు ఎంపీలతో ప్రారంభమై 30 ఏళ్ల తర్వాత సొంతంగా కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని స్థాపించిన బీజేపీ, నరేంద్రమోదీ సారధ్యంలో ఎన్‌డీఏలోని ప్రధాన పార్టీలను కలుపుకుని దేశాన్ని ఆర్థికంగా ప్రగతిబాట పట్టించిందని రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. ఆర్థికాభివృద్ధిలో నాలుగేళ్ల క్రితం 9వ స్థానంలో ఉన్న భారతదేశం నేడు 6వ స్థానంలోకి చేరిందన్నారు. 2030 నాటికి భారతదేశం ప్రపంచ అగ్రదేశాల్లో 3వ స్థానంలో నిలిచే విధంగా మోదీ కృషి చేస్తున్నారన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసిన వెళ్లిన కాంగ్రెస్ పార్టీ విధివిధానాలను చక్కదిద్ది అవినీతి లేని పరిపాలనాధక్షుడిగా ప్రధాని నరేంద్రమోదీ కీర్తిమన్ననలు పొందారన్నారు. శతృదేశమైన పాకిస్తాన్ నేలలోనే అక్కడి తీవ్రవాదులను మన సైనికులు మట్టుబెట్టడంలో నరేంద్రమోదీ చేపట్టిన చర్యలు ప్రపంచానే్న అబ్బురపరిచాయన్నారు. దేశవ్యాప్తంగా 32 కోట్ల మందితో జన్‌ధన్ బ్యాంకు అకౌంట్ తెరిపించి కోట్లాది కుటుంబాలను ఆదుకున్న ఘనత ఆయనదేనన్నారు. సుమారు 70 సంవత్సరాలు తర్వాత భారతదేశంలో ప్రతి కుటుంబానికి గ్యాస్ కనెక్షన్ ఇప్పించి ఆదుకున్న ఘనత ఆయనదేనన్నారు. దేశంలో వెనుకబడిన కులాలను దృష్టిలో ఉంచుకుని 10 శాతం రిజర్వేషన్లు కల్పించి లక్షలాది కుటుంబాలకు చేయూతనిచ్చిన ఘనత మోదీదే అన్నారు.
రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులు దృష్టిలో ఉంచుకుని వందల కోట్ల రూపాయలతో వాటర్ షెడ్లు చేపట్టామని గుర్తుచేశారు. ఆయుష్మాన్ పథకం కింద కోట్లాది మందికి ఆరోగ్యం అందించే బాధ్యత ప్రధాని మోదీ చేపట్టారన్నారు. కేంద్రం చేపట్టిన పలు పథకాలను పోలింగ్ కేంద్రాల వారీగా ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రచారం చేపట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో రాయలసీమ పరిధిలోని 8 పార్లమెంట్ స్థానాల్లో విజయకేతనం ఎగురవేసే దిశగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్, జాతీయ కార్యదర్శి సత్యకుమార్, రాష్ట్ర ఇంచార్జి సునీల్ దేవదర్జి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షుడు కందుల రాజమోహన్‌రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి పురంధరేశ్వరి తదితరులు ప్రసంగించారు.