రాష్ట్రీయం
అటెండర్‌పై వీఆర్‌ఏ లైంగిక వేధింపులు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
కుప్పం: కోరిక తీర్చలేదని మహిళ అటెండర్‌పై తహశీల్దార్ కార్యాలయంలో వీఆర్‌ఏ దాడి చేసిన సంఘటన చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు- కుప్పం తహశీల్దార్ కార్యాలయంలో అటెండర్‌గా విధులు నిర్వహిస్తున్న మహిళపై కనే్నసిన వీఆర్‌ఏ ఆనంద్ మూడు నెలలుగా కోరిక తీర్చమని వేధించేవాడు. కాగా ఆమె సెల్‌ఫోన్ పోయంది. అప్పటి నుండి ఆమె ఫోటోలను మార్ఫింగ్ చేసి అందరికీ పంపిస్తానని, యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తానని వేధించాడు. శుక్రవారం కుప్పం తహశీల్దార్ కార్యాలయంలో అందరి ఎదురుగానే ఆమె వీఆర్‌ఎను నిలదీసింది. దీనితో రెచ్చిపోయిన వీఆర్‌ఎ ఆనంద్ ఆమెపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. విషయం జిల్లా కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో సంఘటనపై విచారణ చేపట్టాలని మదనపల్లి సబ్‌కలెక్టర్‌ను ఆదేశించారు. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు కలకత్తా నుండి ఆరాతీశారు. వివరాలు అందుకున్న ఆయన విచారణ చేపట్టి వీఆర్‌ఎపై వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న విఆర్‌ఎను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.