రాష్ట్రీయం

అమరావతి వేదికగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: అమరావతి వేదికగా బీజేపీయేతర ఐక్యఫ్రంట్ సభ నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. శనివారం కోల్‌కతా సభలో ఈ విషయాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి వివరించారు. ఢిల్లీలో కూడా ఇదే తరహాలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నేతృత్వంలో ర్యాలీ, బహిరంగసభల నిర్వహణపై కోల్‌కతా సభలో స్పష్టత వచ్చింది. కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్ ప్రభుత్వంలో నెలకొన్న అనిశ్చిత స్థితికి కేంద్రంలోని బీజేపీ కుట్ర పన్నుతోందని, ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో కూడా నిరసన ర్యాలీ నిర్వహించడంతో పాటు జాతీయ స్థాయిలో ఐక్యఫ్రంట్ అండగా నిలవాలని జాతీయ నేతలతో భేటీ సందర్భంగా చంద్రబాబు ప్రస్తావించినట్లు సమాచారం. అమరావతిలో సభ నిర్వహణ, కేంద్ర అణచివేత చర్యల గురించి కోల్‌కతాలో జాతీయ నేతలకు చంద్రబాబు వివరించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఫరూక్ అబ్దుల్లాతో జరిపిన చర్చల్లో ఏపీకి ప్రత్యేక హోదా, విభజన అంశాల అమలులో గత నాలుగున్నరేళ్లుగా కేంద్రంలో బీజేపీ అనుసరిస్తున్న వైఖరి, రాజధాని, పోలవరం పనుల్లో కల్పిస్తున్న అవరోధాలపై ప్రస్తావించారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నేతలు, సానుభూతిపరులపై ఐటీ, ఈడీ దాడుల గురించి చర్చించారు. రాజధాని, పోలవరం నిర్మాణాలతో పాటు ప్రత్యేక హోదా పదేళ్లు ఇస్తామని స్వయానా ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్ర ప్రజలకు గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు, బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలోని అంశాలతో పాటు ఎన్డీఏ నుంచి
వైదొలగిన వైనాన్ని, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో బీజేపీకి మద్దతుగా ఏర్పాటు కానున్న ఫెడరల్ ఫ్రంట్ అవకాశవాద రాజకీయాలపై కేజ్రీవాల్, ఫరూక్‌లకు చంద్రబాబు వివరించారు. ఐక్యఫ్రంట్‌లో కాంగ్రెస్ భాగస్వామ్యంపై నేతల అభిప్రాయాలపై ఆరా తీశారు. అసోం మాజీ ముఖ్యమంత్రి ప్రపుల్ల కుమార్ మెహంతా, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామితో పాటు మాజీ ప్రధానమంత్రి దేవగౌడతో వరుసగా చర్చలు జరిపారు. కర్ణాటకలో తాజా పరిస్థితిని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారస్వామి ఈ సందర్భంగా వివరించినట్లు సమాచారం. రాష్ట్రంలో తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎమ్మెల్యేల కొనుగోళ్లకు బీజేపీ నేతలు మంతనాలు సాగిస్తున్నారని ఆయన ఆరోపించినట్లు వినికిడి. ప్రభుత్వాన్ని మైనారిటీలో పడేసే కుట్ర జరుగుతోందని దీన్ని జాతీయ స్థాయిలో ప్రతిఘటించేందుకు సహకరించాల్సిందిగా చంద్రబాబును కోరినట్లు సమాచారం. ఇదిలా ఉండగా తమిళనాడులో బీజేపీకి అనుకూలంగా లేని ప్రాంతీయ పార్టీలపై కేంద్రం అణచివేత విధానాలను డీఎంకే అధినేత స్టాలిన్ ప్రస్తావించినట్లు తెలియవచ్చింది. కాగా మార్చి నెలలో లోక్‌సభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో వచ్చే నెలలోనే అమరావతిలో ఐక్యఫ్రంట్ సభ నిర్వహిస్తే మంచిదని చంద్రబాబు చేసిన ప్రతిపాదనలకు ఆయా పార్టీల నేతలు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. అమరావతిలో నిర్వహించే సభతో ఫెడరల్ ఫ్రంట్ తెరవెనుక రాజకీయాలపై ప్రజలకు తగిన సంకేతాలు పంపేందుకు బాబు వ్యూహరచన చేస్తున్నట్లు చెప్తున్నారు. తెలంగాణలో గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజాకూటమి, టీఆర్‌ఎస్ బలబలాలు, ఈవీఎంల ట్యాంపరింగ్‌పై చంద్రబాబు జాతీయ నేతలతో జరిపిన చర్చలలో అనుమానాలు వ్యక్తం చేసినట్లు తెలిసింది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ యేతర రాష్ట్రాల్లో ఇలాంటి ప్రయత్నాలు జరిగే అవకాశాలు లేకపోలేదని వాదనలు వినిపించడం ద్వారా వచ్చే ఎన్నికల్లో బ్యాలెట్ ఓటింగ్ డిమాండ్‌తో ఐక్య ఫ్రంట్‌తో కలసి ఉద్యమించాలని భావిస్తున్నారు. కాగా కోల్‌కతా సభతో టీడీపీ శ్రేణుల్లో సైతం ఒకింత నూతన ఉత్సాహం నెలకొంది.