రాష్ట్రీయం

రహదార్లు అద్దంలా ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాబోయే రెండేళ్లలో తెలంగాణలోని అన్ని రహదారులనూ అద్దంలా మార్చాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం తర్వాత ప్రభుత్వం రహదారులకే ప్రాధాన్యం ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు. కొత్తగా ఏర్పాటైన గ్రామ పంచాయతీలతో పాటు రాష్ట్రంలోని 12,751 పంచాయతీలకు బీటీ రహదారి సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. ప్రస్తుతం రహదారుల పరిస్థితి ఏమిటి? వాటిని అద్దంలా తయారుచేయడానికి ఏం చేయాలి? అనే విషయంపై ప్రణాళిక రూపొందించాలని ఆయన చెప్పారు. దీనికి అవసరమైన బడ్జెట్ కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. రాష్ట్రంలో రహదారుల పరిస్థితిపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు శనివారం నాడు ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు. ముఖ్యకార్యదర్శులు సునీల్ శర్మ, రామకృష్ణ రావు, ఆర్ అండ్ బీ ఈఎన్సీ గణపతిరెడ్డి, ఎస్‌ఈ చంద్రశేఖర్, సీఎంఓ అధికారులు స్మితా సబర్వాల్, రాజశేఖరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో రహదారుల పరిస్థితిపై సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేంద్రం ద్వారా రికార్డు స్థాయిలో జాతీయ రహదారులను సాధించుకున్నామని సీఎం చెప్పారు. రాష్ట్రంలో ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ శాఖల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రోడ్లు నిర్మాణం చేపట్టామని అన్నారు. ఇంకా రాష్ట్రంలో అవసరమైన చోట రహదారులకు మరమ్మతులు చేయాలని, శిథిలావస్థకు చేరుకున్న బ్రిడ్జీలకు మరమ్మతులు చేయాలని, ఇరుకు బ్రిడ్జీలను వెడల్పు చేయాలని అన్నారు. దీనికోసం ఇఎన్సీ స్థాయి నుండి ఏఈ స్థాయి వరకూ ఆర్ అండ్ బీ అధికారులు సదస్సు
నిర్వహించాలని చెప్పారు. గ్రామ స్థాయి నుండి ప్రతి రోడ్డు పరిస్థితిని సమీక్షించి తీసుకోవల్సిన చర్యలపై ప్రణాళిక రూపొందించాలని అన్నారు. ఏ జిల్లా, ఏ మండలం అనే తేడా లేకుండా అక్కడ ఏ పార్టీ ప్రజాప్రతినిధి ఉన్నారనేది కూడా పక్కన పెట్టి ఎక్కడ అవసరం ఉంటే అక్కడ మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు కూడా రోడ్ల మరమ్మతులను చేయించుకోవాలని సీఎం సూచించారు. పంచాయతీ రాజ్ నుండి ఆర్ అండ్ బీకీ, ఆర్ అండ్ బీ నుండి జాతీయ రహదారులకు రోడ్లు బదిలీ అయిన సందర్భంగా వాటి నిర్వహణ, మరమ్మతుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. కొత్త రోడ్లు నిర్మాణం అయ్యే వరకూ పాత రోడ్లు పాడైనా ఎవరూ పట్టించుకోవడం లేదని, దీనివల్ల ప్రయాణీకులు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని , రోడ్లను బదిలీ చేసే సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహాన్ని కూడా ఖరారు చేయాలని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఎమ్మెల్యేల కార్యాలయాల నిర్మాణం చేపట్టామని, వాటి నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని అన్నారు. కొత్తగా నిర్మించిన క్వార్టర్లను ఎమ్మెల్యేలకు కేటాయించాలని అయన అధికారులకు సూచించారు.
రైతులకు పరిహారం ఇవ్వండి
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కాల్వల నిర్మాణం సందర్భంగా భూమిని కోల్పోయిన రైతులకు వెంటనే పరిహారం అందివ్వాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. ముదోల్ నియోజకవర్గం పరిధిలోని రైతులకు పరిహారం ఇప్పించాలని ఎమ్మెల్యే జీ విఠల్‌రెడ్డి చేసిన విజ్ఞప్తికి ముఖ్యమంత్రి స్పందించి, ఆర్ధిక శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. చిన్న సుద్దవాగు ప్రాజెక్టు నిర్మాణం వల్ల ముంపునకు గురైన ప్రజలకు భూ పరిహారం, ఆర్ ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని ఎమ్మెల్యే కోరారు. ముథోల్ కమ్యూనిటీ హాల్‌ను అప్‌గ్రేడ్ చేయాలని ఎమ్మెల్యే కోరారు.