రాష్ట్రీయం

ఎన్‌ఐఏకి వైసీపీ నేతల వాంగ్మూలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 19: వైసీపీ అధినేత జగన్‌పై దాడి ఘటనకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే కేసుతో సంబంధం ఉందని భావిస్తున్న వారితో పాటు సంఘటన సమయంలో జగన్‌కు సమీపంలో ఉన్న వారిని విచారించిన ఎన్‌ఐఏ శనివారం మరికొంతమందిని విచారించి వాంగ్మూలం సేకరించింది. ముగ్గురు ఎన్‌ఐఏ అధికారుల బృందం విశాఖ సీతమ్మధారలోని మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయ్‌ప్రసాద్ నివాసగృహంలో వీరిని విచారించి వివరాలు రాబట్టింది. గతేడాది అక్టోబర్ 25న విశాఖ విమానాశ్రయం వీఐపీ లాంజ్ వద్ద జగన్‌పై జనిపల్లి శ్రీనివాస్ కోడి కత్తితో దాడికి పాల్పడిన సంగతి విధితమే. ఘటన జరిగినప్పుడు సమీపంలో ఉన్న వారి నుంచి సమాచారం రాబడుతున్నారు. సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర, మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి, కరణం ధర్మశ్రీ, మళ్ల విజయ్ ప్రసాద్, తైనాల విజయ్‌కుమార్ సహా పార్టీ ప్రతినిధులు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), యువజన విభాగం నాయకుడు కొండా రాజీవ్, కేకే రాజు, తిప్పల నాగిరెడ్డి తదితరుల నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. సమారు మూడు గంటల పాటు వీరిని విచారించారు. నిందితుడు శ్రీనివాస్ దాడికి పాల్పడిన విధానం, అనంతరం జరిగిన పరిణామాలపై వివరాలు రాబట్టారు. కట్టుదిట్టమైన భధ్రత కలిగిన విమానాశ్రయం వీఐపీ లాంజ్‌లోకి నిందితుడు శ్రీనివాస్ వచ్చిన తీరు తదితర అంశాలను అడిగినట్టు సమాచారం.