రాష్ట్రీయం

నేటి నుంచి పక్షుల పండగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట,జనవరి 19: విదేశీ విహంగాల విడిది కేంద్రాలకు పండుగ కళ వచ్చింది.. ఆంధ్రా- తమిళనాడు సరిహద్దులోని సూళ్లూరుపేట, తడ ప్రాంతాల్లో పులికాట్ సరస్సు, నేలపట్టులో కిలకిల రావాలు, తెరచాప పడవల అందాలు ప్రకృతి ప్రేమికులను పులకరింపజేసే పక్షులు సందర్శకుల కనువిందుకు సిద్ధమంటున్నాయి. సూళ్లూరుపేట జూనియర్ కళాశాల వేదికగా ఆదివారం నుండి మూడు రోజుల పాటు ఫ్లెమింగో ఫెస్టివల్ వైభవంగా జరగనుంది. రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి భూమా అఖిల ప్రియ చేతులమీదుగా పండుగను ప్రారంభించనున్నారు. ఆమెతో పాటు జిల్లా మంత్రులు పొంగూరు నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు. పక్షుల పండుగ పురస్కరించుకొని శనివారం సూళ్లూరుపేటలో విద్యార్థులతో ఫ్లెమింగో ర్యాలీ నిర్వహించారు. మున్సిపాలిటి చైర్ పర్సన్ నూలేటి విజయలక్ష్మి జెండా ఊపి స్థానిక జూనియర్ కళాశాల మైదానంలో ర్యాలీని ప్రారంభించారు. శనివారం రాత్రి వరకు అదనపు జేసీ కమలకుమారి ఇక్కడే ఉండి అధికారులలో ఏర్పాట్లు తదితర అంశాలపై చర్చించారు. ఇదిలా ఉండగా ఈ సారి పక్షుల పండగకు సంబంధించిన ఏర్పాట్లు చేయడంలో జిల్లా అధికార యంత్రాంగం పూర్తిగా విఫలం చెందారు. ప్రచారం కూడా అరకొర చేశారు. జిల్లా కేంద్రంలోనే హడావిడి చేసి స్థానికంగా నిర్వహణపై ఒక సమావేశం కూడా పెట్టకపోవడం విశేషం. సూళ్లూరుపేటలో ఫ్లెమింగో ఫెస్టివల్ జరిగే మైదానంలో కూడా కేవలం తూతూ మంత్రంగా పనులు చేసి చేతులు దులుపుకొన్నారు. దీనికి తోడు జన్మభూమి-మా ఊరు కార్యక్రమంతో పాటు జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన, సంక్రాంతి సంబరాలు, ఏటి పండుగ నేపధ్యంలో పనులు నత్తనడకగా సాగాయి. అధికార పార్టీకి చెందిన నేతలు,ప్రజాప్రతినిధులు సైతం మనకెందుకులే అన్న చందంగా ఎవరూ ఈ సారి అంతంగా పట్టించుకోకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. ఇదంతా అధికార పార్టీలో ఇటీవల చోటుచేసుకొన్న గ్రూపుల పోరే కారణంగా కన్పిస్తోంది. శనివారం సాయంత్రానికి కూడా స్టాల్స్‌ను సిద్ధం చేయకపోవడం విశేషం. గతంలో ముందు రోజు మధ్యాహ్ననానికే అన్ని ప్రభుత్వ స్టాల్స్‌ను సిద్ధం చేసేవారు. ఈ సారి వేదిక, ఏర్పాట్లు నిర్వహణ బాధ్యత ఎవరికి అప్పగించారో అధికారులకే తెలియని పరిస్థితి. స్టాల్స్ తదితర వాటిని నెల్లూరుకు చెందిన ఒకరికి అప్పగించారని తెలిసింది. వేదిక వరకు మరో కాంట్రాక్టర్‌కు అప్పగించినట్లు తెలిసింది. వేదిక నిర్వహణ కాంట్రాక్టర్ చివరి నిమిషంలో చేతులెత్తియడంతో స్టాల్స్ ఏర్పాటు చేసిన వారికే మళ్లీ వేదిక ఏర్పాటు కూడా అప్పగించి ఎలాగైనా ఆదివారం ఉదయం సరికి వేదిక సిద్ధం చేయాలని అధికారులు వేడుకొన్నారు. అంటే ఒక రాష్టస్థ్రాయి పండుగను కూడా జిల్లా అధికారయంత్రాంగం పూర్తిస్థాయిలో నిర్వహించలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ సారి జిల్లా అధికారులు మొత్తం మంది కొత్త ముఖాలు కావడంతో అవగాహన లేనందునే పూర్తిస్థాయిలో పనులు, ప్రచారం చేయలేకపోయారని వాదన కూడా వినిపిస్తోంది. గతంలో పనిచేసిన అధికారుల సలహాలు తీసుకొని ఉంటే బాగుండేందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ సారి అన్ని జిల్లా కేంద్రంలో ఇతర ప్రాంతాల్లో హడావిడి చేయడంతో సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యతోపాటు అధికార పార్టీ నేతలు కూడా ఫెస్టివల్ నిర్వహణపై అలకపూని ఉన్నారు. మీడియాకు మాత్రం కనీసం సమాచారం ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ప్రతియేటా పక్షుల పండుగకు ప్రభుత్వ, ప్రైవేట్ స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తారు. ఈ స్టాల్స్ నిర్వహణ బాధ్యత కూడా ఈ సారి జిల్లాఅధికారులే చూశారు. మొత్తం 81స్టాల్స్‌ను ఈ సారి ఏర్పాటు చేశారు.
విదేశాల నుంచి శీతాకాలంలో విదేశి అతిథులు (పక్షులు ) పులికాట్ సరస్సు, నేలపట్టుకు వలస వస్తాయి. భారత దేశంలోనే అతిపెద్ద సరస్సులో పులికాట్ రెండవది. ఇక్కడకు పాకిస్తాన్, ఆస్ట్రేలియా, బర్మా, శ్రీలంక, నైబీరియా తదితర దేశాల నుంచి శీతాకాలంలో ఆహారం కోసం వలస వచ్చి ఇక్కడే గుడ్లు పెట్టి పొదిగి పిల్లలకు రెక్కలు వచ్చిన తరువాత వాటితోపాటు ఎగిరిపోతాయి. నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రం గూడ బాతుల సంతానోత్పత్తి కేంద్రంగా ప్రసిద్ధి గాచింది. ఇంకా అరుదైన నత్తగుల్ల కొంగ, నీటికాకి, తెల్లకంకాణాయి, శబరి కొంగ, ఎర్రకాళ్లకొంగ, పెలికాన్, సముద్రపు రామచిలుక(ఫ్లెమింగో), నారాయణ పక్షి, గార్గవి తదితర 117 రకాల పక్షులు ఇక్కడి వస్తాయి. వలస వచ్చే విదేశీ విహంగాలకు స్వాగతం పలుకుతూ ఫ్లెమింగో పేరుతో ప్రభుత్వం ప్రతి ఏటా పక్షుల పండగ నిర్వహించడం విశేషం.
పక్షులను వీక్షించేందుకు అనువైన ప్రదేశం..
సూళ్లూరు పేటనుంచి శ్రీహరికోటకు వెళ్లే మార్గంలో కుదిరి నుంచి శ్రీహరికోట మొదటి గేటు వరకు పులికాట్‌లో పక్షలు విన్యాసాలు కనబడతాయి. అదే విధంగా వేనాడుకు వెళ్లే రహదారిలో కూడా ఉంటాయి. తడ వద్ద పులికాట్‌లోని బోడిలింగాలపాడు వద్ద నారాయణ పక్షులుంటాయి. వీటిని వీక్షించేందుకు సూళ్లూరుపేట పక్షుల పండుగ జరిగే మైదానం నుంచి ఆర్టీసీ బస్సులను సందర్శకుల కోసం నిర్వాహకులు ఉచితంగా ఏర్పాటు చేశారు. ఈ బస్సులో వెళ్లి పులికాట్ తీరంలో పక్షులను వీక్షించవచ్చు. అదే విధంగా నేలపట్టు చెరువులో గూడబాతులు, పెలికాన్ పక్షులు ఉంటాయి. తడ బివిపాళెంలో పడవల రేవు ఉంది. అక్కడ పులికాట్‌లో బోటు షికారు చేయవచ్చు. ఈ ప్రాంతాలకు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసి ఉన్నారు. వీటిలో ఉచితంగా ప్రయాణించవచ్చు.
పర్యాటకులకు వసతులు: మూడు రోజులు జరిగే ఈ పండుగకు విచ్చేసే సందర్శకులకు అట్టకాని తిప్ప వద్ద పర్యావరణ విద్యా కేంద్రం ప్రకృతిలో సహజంగా దొరకు వస్తువులు, మ్యూజియం, వన్యప్రాణుల నమూనాలు, గ్రంధాలయం ఉంది. వీటన్నింటిని సందర్శకులు ఉచితంగా చూడవచ్చు.

చిత్రాలు.. పులికాట్‌లో పక్షలు
* మైదానం లో ఏర్పాట్లు