రాష్ట్రీయం

తెలుగు భాషకు ప్రపంచమంతటా ప్రాముఖ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం (కల్చరల్), జనవరి 19: లోక్‌నాయక్ ఫౌండేషన్ 15వ వార్షికోత్సవం సందర్భంగా నగరంలోని కళాభారతి ఆడిటోరియంలో శనివారం నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ సమాజ సేవే ధ్యేయంగా ప్రజల్లో గుర్తింపు పొందిన సాహితీ, సాంస్కృతిక, బాల సాహిత్యంలో ఉద్దండులైన ముగ్గురికి అవార్డులు ఇవ్వడం గర్వకారణంగా పేర్కొన్నారు. ప్రపంచంలో 175 నగరాల్లో నెలనెలా తెలుగు వెనె్నల అని తెలుగు భాషపై చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తుండగా మన రాష్ట్రంలో తెలుగుభాషకు గ్రహణం పట్టిందన్నారు. సిలికాన్ ఆంధ్రా అనే సంస్థ మన బడి, తానా తరఫున మన పాఠశాల పేరిట తెలుగుభాష ప్రాచుర్యానికి ప్రవాస భారతీయులు విశేషంగా కృషి చేస్తున్నారన్నారు. ఇక్కడ మమీ, డాడీ అంకుల్, ఆంటీ సంస్కృతి చోటుచేసుకోవడం బాధాకరమన్నారు. అంతర్జాతీయ సమితి ప్రకటించిన ప్రకారం అంతరిస్తున్న భాషల్లో తెలుగు ఒకటని, అందువల్ల దానిని పరిరక్షించుకోవాల్సిన గరుతర బాధ్యత ప్రభుత్వం మీద ఉందన్నారు. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్ మాట్లాడుతూ సమాజసేవ చేసిన వారంతా సెలబ్రెటీలు కాబోరని, అయితే ప్రజలకు ఉపయోగరమైన సేవలందించడం ద్వారానే తగిన గుర్తింపు, రాణించడం ఉంటుందన్నారు. సొంత ఖర్చులతో సత్కారాలు చేయించుకునే వారుంటారని, అలాగే డబ్బుతో నాయకత్వం పొందే వారుంటారని, ఇది నిజమైన సేవ కాదని, ప్రజాహితం కోరుకునే వారే నిజమైన సెలబ్రిటీలుగా ఆయన పేర్కొన్నారు. డబ్బు, కీర్తి కావాలని ప్రతిఒక్కరూ కోరుకుంటారని, అయితే కీర్తి ద్వారానే గుర్తింపు లభిస్తుందన్నారు. ప్రజాసేవ, సమాజసేవ వంటివి యార్లగడ్డ నిరంతరం చేస్తున్నారని, ఇది పదిమందికి ప్రేరణగా ఉంటుందన్నారు. ఆత్మీయ అతిథి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు మాట్లాడుతూ సేవ చేయడం బాధ్యతగా భావించాలన్నారు. ఎదుటి వ్యక్తి బాధకు గురైతే మన స్పందన లేకుంటే మానవుడు కాదన్నారు. అందువలనే ప్రతిఒక్కరీలో మానవత్వం ఉండాలన్నారు. కేరళ రాష్ట్ర జస్టిస్ ఆంటోనీ డామ్నిక్ మాట్లాడుతూ యార్లగడ్డ సేవలను అభినందించారు. కేరళ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి దామా శేషాద్రినాయుడు మాట్లాడుతూ వ్యక్తికి బహువచనం శక్తి అయితే దానికి సరైన ప్రతిరూపం యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అని అన్నారు. ఈ సందర్భంగా సాహిత్యంలో విశేష కృషిచేసిన అంపశయ్య నవీన్‌కు లోక్‌నాయక్ ఫౌండేషన్ పురస్కార ప్రదానం చేశారు. దుశ్శాలువ, జ్ఞాపికతోపాటు రూ.1.5 లక్ష చెక్‌ను అందించి ఘనంగా సత్కరించారు. ఆంధ్రా జ్ఞానపీఠ్‌గా ప్రసిద్ధి చెందిన లోక్‌నాయక్ ఫౌండేషన్ పురస్కారాన్ని అంపశయ్య నవీన్‌కు ప్రదానం చేశారు. బాలవికాసానికి కృషి చేసిన నన్నపనేని మంగాదేవికి, దివ్యాంగుల, కళా, సాహిత్య, సాంస్కృతిక రంగాల అభివృద్ధికి విశేష కృషి చేసిన వంశీ రామరాజుకు జీవనసాఫల్య పురస్కా రాలను అందజేశారు. ఈ సందర్భంగా 50వేల వంతున చెక్‌లు అందించారు.
చిత్రం..అంపశయ్య నవీన్ దంపతులకు పురస్కారాన్ని అందించి సత్కరిస్తున్న దృశ్యం