రాష్ట్రీయం

అగ్రిగోల్డ్‌పై నేడు కీలక నిర్ణయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం: అగ్రిగోల్డ్ బాధితుల సమస్యపై సోమవారం జరిగే కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ కుటుంబరావు చెప్పారు. హైకోర్టు విభజన సమస్య వల్ల అగ్రిగోల్డ్ బాధితులకు సంబంధించి కొన్ని ఫైళ్లు రాకపోవడంతో ఎపీ సర్కార్ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయలేక పోయిందని చెప్పారు. హైకోర్టులో ఆ కేసు వచ్చేలోగానే నిధులను సమీకరించి అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామన్నారు. రాష్ట్రంలో 19 లక్షల మంది అగ్రిగోల్డ్ ఖాతాలు ఉన్నాయని, వాస్తవానికి పది లక్షల మంది బాధితులు ఉన్నారని చెప్పారు. బాధితులను తగ్గించామనడం అవాస్తవమని కొట్టిపారేశారు. వచ్చేనెలా మొదటి వారంలోగా రైతు రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. విజయనగరంలో మాన్సాస్ ఆధ్వర్యంలో వైద్య కళాశాల ఏర్పాటు విషయమై ఇంకా స్పష్టత రాలేదని అన్నారు. ఏ విద్యా సంస్థ కూడా అప్పులు చేసి నడపలేదని అన్నారు.