రాష్ట్రీయం

సంస్థాగత నిర్మాణానికి జనసేన సన్నద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: లోక్‌సభతో పాటు రాష్ట్ర శాసనసభ ఎన్నికల నిర్వహణకు భారత ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీకి సిద్ధమవుతుంటే అంతకన్నా వేగంగా వివిధ రాజకీయ పక్షాలు ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ప్రస్తుత పరిస్థితులు చూస్తే రాష్ట్రంలో తెలుగుదేశం, వైకాపా, జనసేన పార్టీల మధ్య త్రిముఖ పోటీ అనివార్యంగా కనిపిస్తోంది. రాష్ట్ర విభజనతో మూల్యం చెల్లించుకున్న జాతీయ పార్టీ కాంగ్రెస్ తిరిగి ఉనికి కోసం సర్వశక్తులు ఒడ్డుతున్న దశలో తెలంగాణ ఎన్నికలు, జాతీయ రాజకీయాల దృష్ట్యా టీడీపీతో పొత్తు పెట్టుకోవటం ఖాయమని తెలుస్తోంది. మరోవైపు ఈ ఎన్నికల్లో చంద్రబాబును దెబ్బతీయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. టీడీపీ, వైకాపాలకు స్పష్టమైన మెజారిటీ రానిపక్షంలో వామపక్షాలతో కలిసి బరిలోకి దిగాలనుకుంటున్న జనసేన
మద్దతు కీలకం కానుందనే ప్రచారం అప్పుడే మొదలైంది. అయితే సంస్థాగతంగా జనసేన పార్టీ నిర్మాణం జరగకపోవటం అతిపెద్ద లోటుగా కనిపిస్తోంది. ఇదే సమయంలో ప్రధాన ప్రతిపక్షం ఇంటింటికీ, గడపగడపకూ కరపత్రాల పంపిణీతో ప్రచారం సాగిస్తుంటే, జనసేన కొద్ది నియోజకవర్గాలు మినహా ఎక్కడా ప్రజల్లోకి వెళ్లిన దాఖలాలు కన్పించడం లేదు. పార్టీ ఫిరాయింపులను అనేక సందర్భంలో తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్న పవన్‌కళ్యాణ్ అధికారం దక్కకపోయినా నిరంతరం ప్రజాసమస్యలపై పోరాడుతున్న వామపక్షాలతో కలిసి ఎన్నికలకు వెళ్లాలనే తుది నిర్ణయానికి వచ్చేశారు. 2014కు ముందే పార్టీని స్థాపించి అటు బీజేపీ, ఇటు టీడీపీకి మద్దతు పలికిన పవన్‌కళ్యాణ్, తరువాత మారిన రాజకీయ పరిణామాలతో తనంతట తానుగా చేనేత కార్మికులు, రాజధాని రైతులు, అగ్రిగోల్డ్ బాధితులు, ఉద్దానం కిడ్నీ బాధితులు.. ఇలా అనేకానేక సమస్యలపై ఎప్పటికప్పుడు పోరాటాలు సాగిస్తున్నారు. ఈనేపథ్యంలో జనసేనకు అనంతపురం, కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాలు మినహా తొమ్మిది జిల్లాలకు ఇద్దరేసి సభ్యులతో సమన్వయకర్తల నియామకం జరిగింది. రాష్టస్థ్రాయిలో దాదాపు 10మంది కన్వీనర్లు కొనసాగుతున్నారు. ఇక నేడోరేపో వెలువడబోయే 25 లోక్‌సభ స్థానాల కమిటీల కోసం పార్టీ శ్రేణులు ఎదురుతెన్నులు చూస్తున్నాయి.