రాష్ట్రీయం

ఆయుష్మాన్ కంటే.. ఆరోగ్యశ్రీ బెటర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 20: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకం కంటే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ ఎన్నో రెట్లు మెరుగైందని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కొనియాడారు. ఆరోగ్యశ్రీ మంచి పథకం కాబట్టే మరింత మెరుగ్గా తీర్చిదిద్ది కొనసాగిస్తున్నామని ప్రకటించారు. ‘మంచిని మంచి అనడానికి మాకు ఎలాంటి భేషజాలు లేవు’ అని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చకు కేసీఆర్ సమాధానమిస్తూ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రశంసించారు. వైఎస్ హయాంలో 108 సేవలు కొనసాగితే, దానికి అమ్మఒడిని తమ ప్రభుత్వం జోడించి కొనసాగిస్తోందని చంద్రశేఖరరావు పేర్కొన్నారు. ప్రధాన మంత్రిని కలిసేందుకు తాను ఎప్పుడు వెళ్లినా ఆయన ఆయుష్మాన్ భారత్‌లో తెలంగాణ రాష్ట్రం చేరకపోవడాన్ని గుర్తు చేస్తారన్నారు. ‘మీరు తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్ కంటే ఆరోగ్యశ్రీ ఎన్నో రెట్లు మెరుగైంది. అందుకే ఆయుష్మాన్ పథకాన్ని తెలంగాణలో చేర్చలేదని ప్రధానికే చెప్పాను’ అని ఆయన వెల్లడించారు. కంటి వెలుగు పథకం కింద ఇప్పటి వరకు 1.32 కోట్ల మందికి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి అద్దాలు అందజేశామన్నారు. కంటి వెలుగు పథకాన్ని ఇతర రాష్ట్రాలు కూడా అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆయన తెలిపారు. త్వరలోనే కంటి వెలుగు మాదిరిగానే చెవి, ముక్కు, గొంతు పరీక్షలను నిర్వహించబోతున్నామని కేసీఆర్ ప్రకటించారు. ఆ తర్వాత ప్రతి ఒక్కరి రక్త నమునాలు సేకరించి ప్రజలందరి హెల్త్ ప్రొఫైల్‌ను రికార్డు చేయబోతున్నామని కేసీఆర్ వెల్లడించారు.