రాష్ట్రీయం

రబీలో తగ్గిన సాగు విస్తీర్ణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: తగ్గిన వర్షపాతం, వరుస తుపానులు వంటి అంశాలు రాష్ట్రంలో రబీ సాగు విస్తీర్ణంపై ప్రభావం చూపుతున్నాయి. మరో ఆరు వారాల్లో రబీ సీజన్ ముగియనున్న తరుణంలో తాజా అధికారిక గణాంకాల ప్రకారం రాష్ట్రంలో సాధారణం కంటే 1.89 లక్షల హెక్టార్లలో సాగు విస్తీర్ణం తగ్గింది. గత ఏడాది రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు సకాలంలో ప్రవేశించి, జూన్ 9 నాటికి రాష్ట్రం అంతటా విస్తరించాయి. దీంతో వర్షపాతం బాగానే నమోదవుతుందని అధికారులు భావించారు. సాధారణ వర్షపాతం 859 మిల్లీమీటర్లు కాగా, 580 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. నైరుతి రుతుపవనాల సమయంలో 32శాతం మేర లోటు వర్షపాతం నమోదు కాగా, ఈశాన్య రుతుపవనాలు కూడా నిరాశ పరిచాయి. సాధారణ వర్షపాతం 296 మీల్లీమీటర్లు కాగా, 124 మిల్లీమీటర్లు మాత్రమే నమోదై 58శాతం
మేర లోటును నమోదు చేసింది. ఇది వివిధ పంటల సాగుపై గణనీయమైన ప్రభావం చూపింది. వర్షాభావం వల్ల రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో, తుపాను, అకాల వర్షాల కారణంగా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో రబీ పంటలు దెబ్బతిన్నాయి. దీంతో సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. సాధారణంగా రబీలో 19.71 లక్షల హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగు చేస్తుంటారు. కానీ ఈ రబీలో ఇప్పటివరకూ 17.82 లక్షల హెక్టార్లు మాత్రమే సాగులోకి వచ్చింది. దీంతో సాధారణం కంటే 1.89 లక్షల హెక్టార్ల మేర సాగు విస్తీర్ణం తగ్గింది. ఈసారి ఖరీఫ్‌లో సాగు చేయని మెట్ట భూముల్లో ఈ రబీలో పంటలు వేయడం ద్వారా ఎక్కువ విస్తీర్ణాన్ని సాగులోకి తేవచ్చని వ్యవసాయ శాఖ అధికారులు భావించారు. ఈమేరకు రబీ లక్ష్యాన్ని 25.54 లక్షల హెక్టార్లుగా నిర్ణయించారు. కానీ లక్ష్యంతో పోలిస్తే 7.42 లక్షల హెక్టార్ల మేర సాగు విస్తీర్ణం తగ్గడం గమనార్హం. వరి 98వేల హెక్టార్లలో, ఆహార ధాన్యాలు 37వేల హెక్టార్లు, పప్పు్ధన్యాలు 17వేల హెక్టార్లలో సాధారణం కంటే సాగు విస్తీర్ణం తగ్గాయి. వేరుశనగ, ఆముదం, సన్‌ఫ్లవర్, తదితర నూనెగింజల సాగు 38వేల హెక్టార్లలో, ఉల్లి, మిరియాలు, మిరప, పొగాకు వంటి వాణిజ్య పంటల విస్తీర్ణం కూడా కొంత మేర తగ్గింది. గత ఏడాది ఖరీఫ్‌లో కూడా వివిధ పంటల సాగుకు సంబంధించి సాధారణం కంటే 5.06 లక్షల హెక్టార్ల మేర విస్తీర్ణం తగ్గడం ఆందోళన కరంగా మారింది. ఇది రాష్ట్రంలో ఆహార ధాన్యాల లభ్యతపై ప్రతికూల ప్రభావం చూపింది.