రాష్ట్రీయం

అసెంబ్లీని ఎందుకు రద్దుచేశారో ఇప్పుడైనా చెబుతారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ తొలి శాసనసభను తొమ్మిది నెలల ముందే ఎందుకు రద్దు చేశారో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడైనా చెబుతారా? అంటూ కాంగ్రెస్ పక్షం సభ్యుడు గండ్ర వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆదివారం జరిగిన చర్చలో పాల్గొంటూ, తెలంగాణ మొదటి శాసనసభ గడువు 2019 మే వరకు ఉండగా, 2018 సెప్టెంబర్ 6 న నే ఎందుకు రద్దుచేశారో ఇప్పటి వరకు కేసీఆర్ వాస్తవాలు చెప్పలేదన్నారు. గత ఐదు నెలలుగా రాష్ట్రంలో ప్రభుత్వ కార్యక్రమాలు స్తంభించిపోయాయని అన్నారు. తొలి శాసనసభ రద్దు తర్వాత మూడు నెలల పాటు ఆపద్ధర్మ ప్రభుత్వం కొనసాగిందని, ఇప్పుడు పూర్తిస్థాయి మంత్రివర్గం ఏర్పాటు కాలేదని, పంచాయతీ ఎన్నికలతో పాటు, లోక్‌సభ ఎన్నికలు తదితర ఎన్నికల వల్ల ఎన్నికల ప్రవవర్తనా నియమావళి అమల్లో ఉంటుందన్నారు. దాంతో ప్రభుత్వ కార్యక్రమాలన్నీ ఆగిపోతాయని, ప్రభుత్వం ఉన్నా లేనట్టుగానే భావించాల్సి ఉంటుందన్నారు. 88 మంది ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్ నుండి ఎన్నికయ్యారని, మరో ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారని, ఈ పరిస్థితిలో కూడా మంత్రివర్గం ఏర్పాటు చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి ఇప్పటికే 40 రోజులు గడిచిపోయాయని, మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయకపోవడానికి కారణాలు ఏమిటో కేసీఆర్ చెబుతారా అంటూ గండ్ర ప్రశ్నించారు.
రైతులకు ప్రకటించిన లక్ష రూపాయల రుణమాఫీ ఒకే దఫాలో అమలు చేయాలని గండ్ర డిమాండ్ చేశారు. రైతులకు పాస్‌పుస్తకాల పంపిణీ సరిగ్గా జరగలేదని, నేటికీ దాదాపు 30 నుండి 40 శాతం వరకు పాస్‌పుస్తకాలు ఇవ్వలేదన్నారు.
రైతులకు గిట్టుబాటుధర లభించేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గండ్ర పేర్కొన్నారు. ఇటీవల మొక్కజొన్న రైతులకు క్వింటాల్‌కు 1429 రూపాయలు రావలసి ఉండగా
రాలేదని, దాంతో వేలాది మంది రైతులు నెలల తరబడి మక్కలను అమ్ముకోకుండా ఆగాల్సి వచ్చిందన్నారు. రైతుల సంక్షేమం కోసం ‘మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్’ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుకోసం బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని కోరారు.
కాంగ్రెస్ హయాంలో రైతులకు ఎలాంటి లాభం జరగలేదని టీఆర్‌ఎస్ చేసిన విమర్శలను ప్రస్తావిస్తూ, భారీగా రుణమాఫీ చేశామని, రుణమాఫీ జరగని రైతులకు ఐదువేల రూపాయల ఆర్థికసాయం చేశామన్నారు. డబల్‌బెడ్ రూం ఇళ్ల నిర్మాణం గురించి చెబుతూ, రాష్టవ్య్రాప్తంగా ఈ పథకంలో ఇళ్ల నిర్మాణం ఆగిపోయిందని, బిల్లులు చెల్లించకపోవడమే కారణమని ఆరోపించారు. భూపాల్‌పల్లిలో 500 ఇళ్ల నిర్మాణం తుదిదశలో నిలిచిపోయిందని వివరించారు. ప్రకృతివైపరీత్యాల సందర్భంగా ఇళ్లకు నష్టం జరిగితే నష్టపరిహారం చెల్లించడం లేదని, ఈ విషయంలో ప్రభుత్వ సానుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. నిరుద్యోగభృతి ఎప్పటి నుండి ఇస్తారో, పింఛన్ల పెరుగుదల ఎప్పటి నుండి అమలు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. దవాఖానాలకు భవనాల నిర్మాణం చేసిన తర్వాత సిబ్బందిని నియమించాలని, వౌలికసదుపాయాలు కల్పించాలని కోరారు. ఇటీవల చేపట్టిన కంటివెలుగులో వరంగల్ జిల్లాలో చాలామందికి కంటి చూపు పోయిందని ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగుల పదవీవిరమణ వయోఃపరిమితి పెంపుదల ఎప్పటి నుండి అమలు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. పోడువ్యవసాయం చేస్తున్న గిరిజనులను అటవీ అధికారులు వేధిస్తున్నారని, ఈ వేధింపులను ఆపివేయాలని డిమాండ్ చేశారు.