రాష్ట్రీయం

ఆంధ్రా మిత్రుడు సాయం చేశాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 20: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తనకు ఆర్థిక సాయం చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక మిత్రుడు తన నియోజకవర్గానికి వచ్చాడని టీఆర్‌ఎస్ సభ్యుడు వేముల ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆదివారం జరిగిన చర్చలో పాల్గొంటూ, వ్యవసాయ రంగానికి 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయడం ఒక్కటే టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తుందని, కేసీఆర్‌ను సీఎంగా మళ్లీ అవకాశం వచ్చేలా చేస్తుందని ఆర్థికసాయం అందించిన ఆంధ్రామిత్రుడు అభిప్రాయపడ్డారన్నారు.
ప్రస్తుతం జాతీయ స్థాయిలో నెలకొన్న పరిస్థితి పరిశీలిస్తే కేసీఆర్ ప్రధాని అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని వేముల పేర్కొన్నారు. ఇటీవలి ఎన్నికల్లో ఓటమిపాలైన కాంగ్రెస్ నేత ఒకరు ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని చెప్పడాన్ని ప్రస్తావిస్తూ, టీఆర్‌ఎస్‌కు ఓట్లు వేసిన తెలంగాణ ప్రజలను సదరు నేత పరోక్షంగా అవమానించినట్టయిందన్నారు.
రాష్ట్రంలో రైతాంగానికి అన్ని విధాలా తమ ప్రభుత్వం చేయూత ఇస్తోందని, నిరంతరం విద్యుత్ సరఫరా చేయడంతో పాటు పంటల పెట్టుబడిగా రైతుబంధు కింద నాలుగువేల రూపాయలు చెల్లించామన్నారు. పంటలకు కనీసమద్దతు ధర లభించేలా చర్యలు తీసుకున్నామన్నారు. కోటి ఎకరాలకు సాగునీరు ఇచ్చేందుకు వీలుగా ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతోందని ప్రశాంతరెడ్డి తెలిపారు.
మిషన్ భగీరథ పథకం దేశానికే ఆదర్శంగా మారిందని వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఒకవైపు రైతుల సంక్షేమం, మరోవైపు పేదల పింఛన్లు కేసీఆర్‌కు రెండుకళ్లుగా ఉన్నాయన్నారు. కల్యాణలక్ష్మి, ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవం జరిగితే 13 వేల రూపాయలు చెల్లించడం, కేసీఆర్ కిట్స్ తదితర పథకాలు దేశంలో ఎక్కడా అమల్లో లేవన్నారు. కేసీఆర్ ప్రభుత్వపరంగా సంపద సృష్టించి, పేదల సంక్షేమం కోసం ఖర్చు చేస్తున్నారన్నారు.
పరిపాలనా సౌలభ్యంకోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేశామని టీఆర్‌ఎస్ సభ్యుడు కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. విద్య, వైద్యాన్ని పేదలకు అందించగలిగామన్నారు. కేసీఆర్ చేపట్టిన పథకాలు, కార్యక్రమాలు జాతీయ స్థాయిలోనే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలోనే గుర్తింపు తెచ్చుకున్నాయన్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో కలిసే పోటీ: ఎంఐఎం
అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌తో కలిసి ఉన్న ఎంఐఎం లోక్‌సభ ఎన్నికల్లో కూడా కలిసే ఉంటామని ఎంఐఎం సభ్యుడు అబ్దుల్ బిన్ బలాలా పేర్కొన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 17 స్థానాల్లో టీఆర్‌ఎస్ 16 స్థానాల్లో, ఎంఐఎం ఒక స్థానంలో విజయం సాధిస్తుందని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు, వచ్చే ఎన్నికల్లో ఏపిలో ఓటమిపాలవుతారన్నారు. రాహుల్ గాంధీ చార్మినార్‌కు వస్తే 1500 మందిని కూడా కాంగ్రెస్ నేతలు పోగేయలేకపోయారని ఆరోపించారు.
చిత్రాలు.. వేముల ప్రశాంత్ రెడ్డి *అబ్దుల్ బిన్ బలాలా