రాష్ట్రీయం

విపక్షం నేతగా భట్టికి గుర్తింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 20: తెలంగాణ శాసనసభలో ప్రధాన ప్రతిపక్షం నేతగా భట్టివిక్రమార్క ఉంటారని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఆదివారం ఉదయం 10.30 గంటలకు సభ ప్రారంభం కాగానే స్పీకర్ ఈ మేరకు ప్రకటన చేశారు. భట్టి విక్రమార్కను కాంగ్రెస్ పక్షం నాయకుడిగా ఎన్నుకున్నామంటూ కాంగ్రెస్ లెజిస్లేచర్ పక్షం నుండి లేఖ అందిందన్నారు. సభలో టీఆర్‌ఎస్ తర్వాత ఎక్కువ మంది సభ్యులు ఉన్న కాంగ్రెస్‌ను ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించామని, భట్టి విక్రమార్క ఈ పక్షానికి నాయకుడిగా ఉంటారన్నారు. అధికారికంగా ఆయనకు ప్రతిపక్ష నేతగా గుర్తింపు ఉంటుందని వెల్లడించారు. ఇలా ఉండగా ఎంఐఎం ఫ్లోర్ లీడర్‌గా అక్బరుద్దీన్ ఒవైసీని గుర్తించామని స్పీకర్ ప్రకటించారు. ఈ మేరకు ఎంఐఎం పార్టీ జనరల్ సెక్రటరీ నుండి తనకు లేఖ అందిందన్నారు.
టీడీపీ సభ్యుడు సండ్ర ప్రమాణ స్వీకారం
తెలంగాణ శాసనసభకు సత్తుపల్లి నియోజకవర్గం నుండి టీడీపీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికైన సండ్ర వెంకట వీరయ్య ఆదివారం అసెంబ్లీలో పదవీప్రమాణం చేశారు. ఈ నెల 17 న 114 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో సండ్ర సభకు రాలేదు. దాంతో ఆదివారం ఉదయం 10.30 గంటలకు సభ ప్రారంభం కాగానే స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఈ మేరకు ప్రకటన చేశారు. సండ్ర వెంకటవీరయ్య పదవీ ప్రమాణం చేస్తారని పోచారం ప్రకటించారు.