రాష్ట్రీయం

ఆర్థిక అభివృద్ధిలో తెలంగాణ నెంబర్ వన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 20: ఆర్థిక అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిచిందని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ వెల్లడించారు. అభివృద్ధి, సంక్షేమం, సామాజిక రంగాల్లో పురోభివృద్దిని సాధించామని వెల్లడించారు. గత నాలుగున్నర ఏళ్లలో 171.17 ఆర్ధిక వృద్ధిని సాధించామని తెలిపారు. గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శాసన మండలిలో జరిగిన చర్చలో సభ్యులు పాల్గొని అండగ నిలవడం పట్ల అభినందనలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, ప్రభుత్వం చేపడుతున్న పథకాలకు దేశ వ్యాప్తంగా అదరణ లభిస్తోందన్నారు. ఆదివారం సభలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చలో ప్రభుత్వం తరపున హోంమంత్రి సమాధానమిచ్చారు. చైర్మన్ కే.స్వామిగౌడ్ అధ్యక్షతన జరిగింది. సమావేశం ప్రారంభ కాగానే గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చను చేపట్టింది. ప్రభుత్వ చిఫ్‌విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి చర్చను ప్రారంభించారు. ప్రతి పక్షనాయకుడు మహ్మద్ షబ్బీర్ అలీ, బీజేపీ సభ్యుడు ఎస్.రామచందర్ రావుతో పాటు అధికార, ఎంఐఎంకు చెందిన 18 సభ్యులు సభలో ప్రసంగించారు. ఒక రోజు సాగిన ఈ సభ నాలుగు గంటల 53 నిమిషాలు కొనసాగింది. ఈ సందర్భంగా హోంమంత్రి సభ్యులు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చారు. ఆయన మాట్లాడుతూ ప్రజలూ ఎది చెబితే ముఖ్యమంత్రి కేసీఆర్ అది చేస్తానని అంటారన్నారు. తెలంగాణ పథకాలు దేశానికి ఆదర్శమని, ప్రభుత్వం చేపట్టిన పథకాల పట్ల ముగ్దులైన ప్రజలు మళ్లీ మద్దతు పలికారన్నారు. 2014లో అధికారం చేపట్టిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీతో నిలమెట్టుకోవడంలో విజయం సాధించాగలిగామని చెప్పారు. గత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ వస్తే నీరు, కరెంటు వంటి సమస్యలతో పాటు శాంతి భద్రతలు దెబ్బతింటాయన్నారు. గత నాలుగున్నర ఏళ్లలో రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఏలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోలేదని గుర్తు చేశారు. ప్రత్యేకించి హైదరాబాద్ నగరంలో ఎలాంటి మతకలహాలు జరగాలేదని ఇక్కడ అన్ని వర్గాల ప్రజలు శాంతి సమరస్యంతో మెలిగారని తెలిపారు. శాంతి భద్రతలకును పర్యవేక్షించడం జరిగిందన్నారు. తెలంగాణ పోలీసులు చక్కగా విధులను నిర్వహిస్తున్నారని, ఫలితంగా ఇటీవల జరిగిన రంజాన్, గణేష్, బోనాలు పండుగా వేడుకలతో పాటు , మెహరం విజయవంతంగా, ప్రశాంతంగా సాగాయని మహమూద్ అలీ తెలిపారు. రాష్ట్రంలో కరెంటు సమస్యలు లేకుండా ఇటు రైతులకు, గృహ అవసరాలకు, పరిశ్రమలకు 24 గంటలు నిరంతరం విద్యుత్ సరఫరాను కొనసాగించిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు పెద్దపీట వేసిన సీఎం పోలీస్ కమాండ్ కంట్రోల్ రూం, నూతన భవనాల నిర్మాణం, వాహనాల కొనుగులు కోసం కోట్ల రూపాయలు మంజురు చేశారని తెలిపారు. పోలీసులకు సరిసమానంగా విధులు నిర్వహిస్తున్న హోంగార్డులకు ప్రతి నెల 20వేల రూపాయల జీతం అందజేస్తుందని, ప్రతి సంవత్సరానికి వెయ్యి రూపాయలను పెంచడం జరుగుతుందని హోం మంత్రి సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానామిచ్చారు. రైతులకు సంబంధించిన రూణాలు దాదాపు రూ.17వేల కోట్ల వరకు పూర్తిచేశామని, రైతు బీమా పథకం కింద రెండు పంటలకు గాను రూ.8వేలు ఇచ్చాం, ప్రస్తుతం దాని పెంచి 10వేలకు చేయడం జరుగుతుందన్నారు. అనుకోని పరిస్థితుల్లో రైతు మృతి చెందిన వారి కుటుంభంను అదుకోడానికి రైతులకు రైతు బీమా పథకం కింద రూ.5లక్షల ఇన్స్‌రెన్స్‌ను కల్పిస్తున్నామన్నారు. కోటి ఎకరాలకు నీరిచ్చి రైతులకు అండగా నిలవాలన్న లక్ష్యాంతో సీఏం కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. పెంచిన వివిధ రకాల అస్రా పెన్షన్లను ఏప్రిల్ మాసం నుండి అమల్లోకి తెస్తామన్నారు. ప్రభుత్వం చేపట్టిన షాదీ ముబారక్, కాళ్యాణ లక్ష్మీతో పాటు వివిధ రకాల పథకాలతో ప్రజలకు ఎంతో మేలు జరిగిందని గుర్తు చేశారు. మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వ పెద్దపీట వేసిందని, కేంద్ర ప్రభుత్వం మైనార్టీల సంక్షేమం కోసం రూ.4400 కోట్లు కేటాయిస్తే రాష్ట్రంలో 70 నుంచి 80 లక్షల మంది ముస్లీం మైనార్టీల కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.2వేల కోట్లు మంజురు చేసిందని తెలిపారు. ఇప్పటి వరకు 900 కోట్లు మంజూరు చేయగా, రూ.500 కోట్లు రీలిజ్ అయ్యాయని వివరించారు. రెండు లక్షల 72వేల డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని సభ్యులు అడిగిన ప్రశ్నకు హోంమంత్రి బదులిచ్చారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా అమోదించిన్ ట్లు సభాపతి స్వామిగౌడ్ వెల్లడించారు. అనంతరం మండలిని చైర్మన్ స్వామి గౌడ్ నిరావధికంగా వాయిదా వేశారు.