రాష్ట్రీయం

ఆర్టీసీ పరిరక్షణకు నిధులు కేటాయించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (సిటీ), జనవరి 20: రాష్ట్రంలో లక్షల మంది ప్రజలకు రవాణా సౌకర్యం అందిస్తున్న ఆర్టీసీకి నష్టాలు రావడానికి డీజిల్, స్పేర్ పార్ట్స్ ధరల పెరుగుదలే ప్రధాన కారణమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అన్ని కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ అభిప్రాయపడింది. ఆర్టీసీని పరిరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేసింది. ఇక్కడి ఆర్టీసీ హౌస్‌లోని ఎంప్లారుూస్ యూనియన్ కార్యాలయంలో ఆదివారం అన్ని ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు కలిసి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జేఏసీగా 13 మందితో కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జేఏసీ కన్వీనర్‌గా పలిశెట్టి దామోదరరావు, కోకన్వీనర్లుగా సుందరయ్య, వి వరహాలనాయుడును ఎన్నుకున్నారు. ఈసందర్భంగా జేఏసీ నేతలు మాట్లాడుతూ రాష్ట్రంలో రోజుకి 65 నుండి 70 లక్షల మంది ప్రజలకు రవాణా సౌకర్యం కల్పిస్తూ ఆర్టీసీ ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థగా ఎదిగిందన్నారు. అయితే ఆర్టీసీకి నష్టాలు రావడానికి 2015 నుండి ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా బస్ ఛార్జీలు పెంచకపోవడం ఒక కారణమని వారన్నారు. ఇదే సమయంలో డీజిల్, స్పేర్ పార్ట్స్ ధరలు 50శాతం పెరగడంతో సంస్థకు నష్టాలు పెరిగాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతున్న సుమారు 5వేల పల్లెవెలుగు బస్సులకు వస్తున్న నష్టాలు ఏడాదికి రూ. 800 కోట్లుగా ఉన్నాయన్నారు. ప్రభుత్వానికి వస్తున్న మోటారు వాహనాల పన్ను రూ.300 కోట్లకు పైబడి ఉందన్నారు. ఆర్టీసీ అప్పులకు రోజుకి రూ. 2 కోట్లు వడ్టీలు కట్టాల్సి వస్తోందన్నారు. ఈ పరిస్థితుల్లో ఆర్టీసీని ప్రభుత్వం ఆదుకోవాలని, సంస్థను పరిరక్షించుకునేందుకు ప్రస్తుతం బడ్జెట్‌లో సుమారు రూ.3720 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇన్ని ఇబ్బందులు, నష్టాలు ఉన్నప్పటికీ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా బస్సులను అన్ని ప్రాంతాలకు నడుపుతున్నారని, దీంతో నష్టాలు మరింతగా పెరిగాయన్నారు. ఈనేపథ్యంలో ఆర్టీసీకి వస్తున్న నష్టాలు మొత్తం ప్రభుత్వం భరించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే గతంతో పోల్చుకుంటే ఆర్టీసీ ఉద్యోగుల కృషి ఫలితంగా రూ.2వేల కోట్ల రూపాయల ఆదాయం సంస్థకు లభించిందన్నారు. గత నాలుగేళ్లలో 10వేల మంది రిటైరయ్యారని, ఇంతచేసినా నష్టాలు వస్తున్నాయంటే ఆర్టీసీని విద్య, వైద్య రంగాల మాదిరిగా ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికీ సంస్థలో ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగుల కంటే 20 నుండి 30 శాతం తక్కువ వేతనాలతో పనిచేస్తున్నారని తెలిపారు. 2017 ఏప్రిల్ 1 నుండి జరగాల్సిన వేతన సవరణను 50శాతం ఫిట్‌మెంట్ కలిపి వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 22న యాజమాన్యంతో జరిగే మలివిడత చర్చల్లో సానుకూల వైఖరి రాకుంటే 23న జేఏసీ ఆధ్వర్వంలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని వారు వెల్లడించారు. జేఏసీకి దూరంగా ఉన్న ఎన్‌ఎంయూ కార్మికల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని తమతో కలసి రావాలని వారు విజ్ఞప్తి చేశారు.