రాష్ట్రీయం

కోల్‌కతా ర్యాలీతో మోదీ ఖేల్ ఖతమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జనవరి 20: కోల్‌కతాలో యునైటెడ్ ఇండియా ర్యాలీ చూసి బీజేపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. మొత్తం 22 పార్టీల నేతలను ఒకే వైదికపై చూసి ప్రధాని నరేంద్ర మోదీ బెంబేలెత్తుతున్నారని, ఆయన ఖేల్ ఖతం అయినట్టేనని వ్యాఖ్యానించారు. సిల్వసా సభలో ఆయన చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమన్నారు. దోపిడీ దొంగలంతా ఒక్కటయ్యారని మోదీ ఆరోపించటం దిగజారుడుతనానికి పరాకాష్ట అని ఆదివారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. రాఫెల్ కంటే పెద్ద దోపిడీ ఏముందని ప్రశ్నించారు. రూ. 43వేల కోట్ల దోపిడీ మోదీ ఘనత కాదా? అని నిలదీశారు. వేల కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టిన వారిని ఎవరు రక్షిస్తున్నారో దేశ ప్రజలకు తెలుసన్నారు. నీరవ్ మోదీ, చోక్సీ బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టారని, మోసగాళ్ల పరారీ వెనుక ఎవరున్నారో వివరించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి చెప్పే వెళ్లానని మాల్యా ప్రకటించలేదా అని నిలదీశారు. దోపిడీదార్ల గురించి మోదీ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. తోడుదొంగలంతా బీజేపీలోనే ఉన్నారని, రాఫెల్‌పై సుప్రీం కోర్టును కూడా పక్కదారి పట్టించారని ధ్వజమెత్తారు. రాఫెల్ విమానాల ధరలు 41శాతం అధికంగా నిర్ణయించారని, 14శాతం మాత్రమే ఎక్కువ ధర పెట్టామని చెప్పుకున్నా నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు. విమానాల ధరలు పెంచినట్లు ఒప్పుకున్నారని, ప్రజలకు సంజాయిషీ ఇచ్చుకునే దైన్యస్థితిలో మోదీ అవినీతి వ్యవహారం సాగిందన్నారు. పతనం అంచున బీజేపీ ప్రభుత్వం ఉందన్నారు. అందుకే మోదీలో అసహనం పెరుగుతోందని వ్యాఖ్యానించారు. పెద్దనోట్ల రద్దు కుంభకోణంగా మార్చింది బీజేపీ కాదా యనమల నిలదీశారు. బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పోయిందన్నారు. మోదీ దోపిడీ పాలనకు వ్యతిరేకంగానే కోల్‌కతా ర్యాలీ జరిగిందని, మోదీపై ప్రజా వ్యతిరేకతకు ఇది అద్దం పట్టిందన్నారు లోక్‌పాల్ బిల్లులో ఐదేళ్లు జాప్యం చేయటం మోదీ పాలనకు నిదర్శనమన్నారు. అన్నా హజారే రాసిన 32లేఖలు బుట్టదాఖలు చేశారని దుయ్యబట్టారు. జనవరి 30న హజారే దీక్షకు దిగటం మోదీ వైఫల్యానికి ప్రతీకగా విమర్శించారు. బీజేపీ దాడులతో అన్నివర్గాల ప్రజల్లో అభద్రత పెంచారన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలలో ఆ పార్టీ పట్ల, ప్రధాని మోదీ పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తవౌతోందని చెప్పారు. రానున్న ఎన్నికల్లో దేశంలో ప్రజాస్వామ్యానికి, మోదీ నియంతృత్వానికి మధ్య పోటీ జరుగుతుందన్నారు. ఇందులో ఏదికావాలో అంతిమంగా ప్రజలే నిర్ణయిస్తారని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నీతిమంతమైన పాలనకు, జగన్ అవినీతి కుంభకోణాలకు మధ్య జరిగే పోటీలో అంతిమ విజయం తమదేనని మంత్రి యనమల ధీమా వ్యక్తం చేశారు.