రాష్ట్రీయం

జేఈఈ మెయిన్స్‌లో గజ్వేల్ విద్యార్థి ప్రతిభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్ / ములుగు: జేఈఈ మెయిన్స్‌లో సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రాంతానికి చెందిన విద్యార్థి ఏడెల్లి సాయికిరణ్ జేఈఈ మెయిన్స్‌లో ప్రతిభ చాటాడు. దేశవ్యాప్తంగా మెయిన్స్ పేపర్-1 ఫలితాలు ప్రకటించగా, అందులో ఏడెల్లి సాయికిరణ్ రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు, జాతీయ స్థాయిలో 3వ ర్యాంకు సాధించారు. కాగా, పాములపర్తికి చెందిన దయానంద్, సునంద దంపతులు వృత్తిరీత్యా ఉపాద్యాయులు, సాయికిరణ్ ప్రాథమిక విద్య పాములపర్తి, ప్రజ్ఞాపూర్‌లో పూర్తి చేయగా, ప్రస్తుతం మాదాపూర్ నారాయణ విద్యాసంస్థలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. తమ కుమారుడు సాయికిరణ్‌కు జాతీయ, రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు రావడం పట్ల తల్లిదండ్రులు దయానంద్, సునందలు హర్షం వ్యక్తం చేస్తుండగా, తమ విద్యార్థి చక్కటి ఫలితాలు సాధించడం పట్ల సెంట్‌మేరీస్ పాఠశాల డైరెక్టర్ ఇన్నారెడ్డి అభినందించారు. కాగా, కంప్యూటర్ ఇంజనీర్ కావడం తన లక్ష్యమని ముంబైలోని ఐఐటీలో కంప్యూటర్ ఇంజనీర్ చదవాలనే పట్టుదలతో శ్రమిస్తున్నట్లు విద్యార్థి సాయికిరణ్ పేర్కొన్నారు.