రాష్ట్రీయం

నదుల అనుసంధానంతో రాష్ట్రం సస్యశ్యామలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: పంచనదుల అనుసంధానంతో రాష్ట్రం మొత్తం సస్యశ్యామలం చేయాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు. ఇప్పటికే గోదావరి-కృష్ణా అనుసంధానంతో అద్భుత ఫలితాలు సాధించామని ప్రపంచమంతా ఏపీ వైపు చూస్తోందని తెలిపారు. ఇక గోదావరి- పెన్నా అనుసంధానం పూర్తయితే రాయలసీమ రతనాల సీమగా మారుతుందని ఆకాంక్షించారు. ఇందుకోసం కార్యాచరణ రూపొందించామని చెప్పారు. సోమవారం ఉండవల్లి ప్రజావేదిక నుండి నీరు-ప్రగతి, వ్యవసాయం- పురోగతిపై కలెక్టర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ చిత్తూరు జిల్లాకు కృష్ణా జలాల తరలింపు ఓ రికార్డు అన్నారు. రాయలసీమను సస్యశ్యామలం చేయాలనే ప్రయత్నాలు ఫలిస్తున్నాయన్నారు. గతంలో మదనపల్లికి నెలలో 15 రోజులకోసారి నీళ్లు అందేవని, ఇప్పుడు చిత్తూరు మెట్ట ప్రాంతాలకు కూడా నీటి సరఫరా చారిత్రాత్మకమన్నారు. పుంగనూరు, తంబళ్లపల్లి, కుప్పం, మదనపల్లికి నీరుచేరితే కరవు అదృశ్యమవుతుందని తెలిపారు. సెరీకల్చర్‌ను మరింతగా ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు. టమోటా హబ్‌గా చిత్తూరు రూపుదిద్దుకుంటుందన్నారు. అన్ని ప్రాంతాలకు నీరిస్తున్నాం.. దీంతో ప్రగతి సాధిస్తున్నామని ఉద్ఘాటించారు. రాయలసీమ నాలుగు జిల్లాలకు నీరందించ గలిగాం.. ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది.. హార్టికల్చర్ హబ్‌గా రూపుదిద్దుకుందని వివరించారు. ఇక ప్రకాశం జిల్లాకే నీరందించాల్సి ఉందన్నారు. వెలిగొండ పూర్తయితే
ఆ జిల్లాలో నీటి కొరతను అధిగమించ వచ్చన్నారు. పంటలపై తెగుళ్లను నియంత్రించ గలిగామని చెప్తూ సూక్ష్మ పోషకాల లోపాలను నివారించామన్నారు. వ్యవసాయంతో సంపద సృష్టి జరగాలన్నారు. ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. లోటు వర్షపాతంలో కూడా దిగుబడులు తగ్గకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. సమర్థ నీటి నిర్వహణతోనే ప్రగతి సాధ్యపడిందన్నారు. 97 శాతం రైతుల ఆదాయం రెట్టింపు చేశామని వ్యవసాయంలో 11 శాతం వృద్ధిరేటు సాధించామని వివరించారు. దేశవ్యాప్తంగా రెండు శాతం మాత్రమే వృద్ధి రేటు ఉందన్నారు. పొరుగు రాష్ట్రంలో 0.2 శాతమే ఉందన్నారు. పట్టిసీమ దండగ అన్న వాళ్లకు సీమ నీళ్లే సమాధానం చెప్తాయన్నారు. సమర్థ నీటి నిర్వహణపై రైతుల్లో అవగాహన కల్పించాలన్నారు. గండ్లు కొట్టే వారి పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని హెచ్చరించారు. సీమ జిల్లాలకు నీరివ్వటంతో ప్రతిపక్షం కళ్లలో నిప్పులు పోసుకుందని రెచ్చకొట్టే ప్రయత్నాలకు రైతులు దూరంగా ఉండాలని కోరారు. చిత్తూరులో కుప్పం వరకు నీరివ్వగలిగామని అనంతపురంలో హిందూపురం, మడకశిరకు చేరాలన్నారు. మైక్రో ఇరిగేషన్ సత్ఫలితాలను ఇస్తోందన్నారు. వినూత్న ఆలోచనలు నిరంతర శ్రమతోనే ఇది సాధ్యమైందని చెప్పారు. నీరు బంగారంతో సమానమని చెప్తూ భూగర్భ జలాలు మన వారసత్వ సంపద అన్నారు. పొదుపుగా నీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతి నీటి చుక్క సంపద సృష్టికి దోహద పడాలని ఆకాంక్షించారు. నరేగాలో రూ 7400 కోట్లు వినియోగించాలనేది లక్ష్యమని ఇందులో రూ 4వేల కోట్లు మెటీరియల్, మరో 3400 కోట్లు వేజ్ కాంపొనెంట్ కింద ఖర్చు చేయాలన్నారు. కరవు మండలాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అదనపు పనిదినాలు సద్వినియోగం చేయాలని అధికారులకు నిర్దేశించారు. నరేగా పనుల్లో ఎక్కడా అలసత్వం ప్రదర్శించరాదని స్పష్టం చేశారు. అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ ఏడాది 7500 కిలోమీటర్ల సీసీ రోడ్లు పూర్తి చేశామని ఇంకా 500 కిలోమీటర్లు ఏర్పాటు కావాల్సి ఉందన్నారు. అంగన్‌వాడీ భవనాలు, పాఠశాలల ప్రహరీగోడల నిర్మాణాలపై శ్రద్ద వహించాలన్నారు.