రాష్ట్రీయం

గుబాళించిన గులాబి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: శాసనసభ ఎన్నికల మాదిరిగానే పంచాయతీ ఎన్నికల్లోనూ అధికార తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభంజనం సృష్టించింది. ఎన్నికలు ఏవైనా తమదే తిరుగులేని ఆధిపత్యామని టీఆర్‌ఎస్ మరోసారి చాటుకుంది. గ్రామ పంచాయతీలకు మూడు విడతల్లో నిర్వహిస్తోన్న ఎన్నికల్లో మొదటి విడతకు సోమవారం పోలింగ్ జరిగింది. ఒంటి గంటకు పోలింగ్ ముగియగానే ఓట్ల లెక్కింపు ప్రారంభం కావడంతో సాయంత్రం ఏడు గంటల వరకు 85 శాతం ఫలితాలు వెలువడ్డాయి. పోలింగ్ దాకా వెళ్లకుండా ఏకగ్రీవమైన గ్రామ పంచాయతీల్లోనూ టీఆర్‌ఎస్సే అత్యధిక సర్పంచ్ స్థానాలు గెలుచుకున్న విషయం తెలిసిందే. మొదటి విడత ఎన్నికలకు 4,470 గ్రామాలను ఎంపిక చేయగా ఇందులో 769 మంది సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏకగ్రీవం కాగా మిగిలిన 3701 గ్రామ పంచాయతీలకు సోమవారం ఎన్నికలు జరిగాయి. ఇందులో ప్రకటించిన ఫలితాల్లో రాత్రి పది గంటల వరకు అందిన సమాచారం ప్రకారం టీఆర్‌ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు అత్యధికంగా 2581 సర్పంచ్ స్థానాలను గెలుచుకోగా, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్‌లు 891 స్థానాల్లో విజయం సాధించగలిగారు. కాంగ్రెస్ నుంచి గెలుపొందిన సర్పంచ్‌లు ఎక్కువగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తోన్న జిల్లాలు, నియోజకవర్గాల నుంచే కావడం విశేషం. ఖమ్మం, రంగారెడ్డి, సంగారెడ్డి
నుంచి ఎక్కువగా కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్‌లు గెలుపొందారు. ఇలా ఉండగా టీడీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు 28 మంది, బీజేపీ బలపరిచిన 65 మంది అభ్యర్థులు, సీపీఐ బలపరిచిన 19 మంది అభ్యర్థులు, సీపీఎం బలపరిచిన 32 మంది అభ్యర్థులు, ఇతరులు 746మంది విజయం సాధించారు. సర్పంచ్ పదవులతో పాటు వార్డులకు ఎన్నికైన సభ్యులు కూడా టీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థులే నాలుగింట మూడు వంతు స్థానాలను దక్కించుకోవడం మరో విశేషం.