రాష్ట్రీయం

అభివృద్ధిలో అగ్రగామిగా ఏపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆకివీడు, జనవరి 21: అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రగామిగా నిలుపుతామని కేంద్ర జాతీయ రహదారులు, జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టంచేశారు. ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టుకు నూరు శాతం నిధులు అందించి, రాష్ట్ర సహకారంతో పూర్తిచేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలోని పలు జాతీయ రహదారులను జాతికి అంకితం చేసే కార్యక్రమంలో భాగంగా కేంద్ర మంత్రి గడ్కరీ సోమవారం పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు వచ్చారు. రాష్ట్రంలోని 39 జాతీయ రహదారులకు సంబంధించి రూ.16,878 కోట్లతో 1384 కిలోమీటర్ల నిర్మాణానికి ఈ సందర్బంగా గడ్కరీ శంకుస్థాపనలు చేశారు. అనంతరం స్థానిక జిల్లా పరిషత్ హైస్కూలు ఆవరణలో జరిగిన బహిరంగ సభలో మంత్రి గడ్కరీ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌ను అన్నివిధాలా అభివృద్ధి చేస్తామని స్పష్టంచేశారు. వౌలిక సదుపాయాలు పూర్తిస్థా యిలో ఉన్న ప్రాంతాలే అభివృద్ది చెందుతాయని, అందుకే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించారన్నారు. రాష్ట్రంలో రహదారులు, ఇతర సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అభివృద్ది విషయంలో రాజకీయాల ప్రమేయం ఉండబోదని గడ్కరీ స్పష్టంచేశారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు సహా ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాజెక్టులకు అనుమతులిచ్చి రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. గత నాలుగున్నరేళ్లుగా రాష్ట్భ్రావృద్ధికి ప్రధాని నరేంద్రమోదీ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సహకరించడంలేదని ఆరోపిస్తోందన్నారు. 2014కు ముందు రాష్ట్రంలో జాతీయ రహదార్లు 4193 కిలోమీటర్లు ఉండగా, ప్రస్తుతం అది 7246 కిలోమీటర్లకు చేరుకుందన్నారు. అలాగే భారత్‌మాల ప్రాజెక్టు కింద రూ.44వేల కోట్ల వ్యయంతో2529 కిలోమీటర్ల మేర రోడ్లు అభివృద్ధి చేయబోతున్నామన్నారు. అలాగే సేటుభారతం పథకం కింద రాష్ట్రంలో రూ.2500 కోట్ల వ్యయం కాగల 31 ఆర్వోబీలు నిర్మించనున్నామన్నారు. ఇందులో రూ.1310 కోట్లు వ్యయం కాగల 18 ఆర్వోబీలు మంజూరై నిర్మాణంలో ఉన్నాయన్నారు. సభలో పాల్గొన్న రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ కేంద్ర మంత్రి గడ్కరీ ఒక విజన్ ఉన్న నాయకుడన్నారు. అయ్యన్న పాత్రుడు తన ప్రసంగంలో ఆద్యంతం గడ్కరీని పొగడ్తలతో ముంచెత్తారు. ఈ కార్యక్రమంలో నరసాపురం, రాజమహేంద్రవరం ఎంపీలు గోకరాజు గంగరాజు, మాగంటి మురళీమోహన్, ఉండి ఎమ్మెల్యే వి శివరామరాజు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, మంతెన సత్యనారాయణరాజు, బీజేపీ నేత కావూరి సాంబశివరావు, ప.గో. జడ్పీ వైస్-్ఛర్‌పర్సన్ మనె్న లలితాదేవి, మోటుపల్లి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
చిత్రం..ఆకివీడులో జాతీయ రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న కేంద్ర మంత్రి గడ్కరీ