రాష్ట్రీయం

వేడుకగా త్రైమాసిక మెట్లోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జనవరి 21: పురంధరదాసవర్యుల కీర్తనల్లో వేదాల సారం దాగి ఉందని వ్యాసరాజ మఠం పీఠాధిపతి విద్యాశ్రీశతీర్థస్వామీజీ ఉద్ఘాటించారు. టీటీడీ దాససాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం సోమవారం తెల్లవారుజామున తిరుపతిలోని అలిపిరి పాదాలమండపం వద్ద వైభవంగా జరిగింది. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విద్యాశ్రీశతీర్థస్వామీజీ అనుగ్రహభాషణం చేస్తూ పురందర దాసులు, వ్యాసరాజయతీశ్వరులు, అన్నమాచార్యులు, శ్రీకృష్ణదేవరాయలు లాంటి మహనీయులు భక్తి ప్రపత్తులతో తిరుమల కొండలను అధిరోహించి స్వామివారి వైభవాన్ని దిశదిశలా వ్యాప్తి చేశారని వివరించారు. అలాంటి వారి అడుగుజాడలలో నడిచి ఆ దేవదేవుని కృపకు అందరూ పాత్రులుకావాలనే తలంపుతో టీటీడీ మెట్లోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని తెలిపారు. బ్రహ్మముహూర్తంలో కాలినడకన మెట్లను అధిరోహించి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఎంతో పుణ్యఫలమన్నారు. ఈకార్యక్రమంలో దాస సాహిత్య ప్రాజెక్ట్ ప్రత్యేకాధికారి పీఆర్ ఆనందతీర్థాచార్య అంతకుముందు భజనమండళ్ల సభ్యులు మూడో సత్రం ప్రాంగణం నుంచి అలిపిరి శ్రీవారి పాదాల మండపం వద్దకు చేరుకున్నారు. అనంతరం పాదాల మండపం వద్ద సంప్రదాయబద్దంగా మెట్లపూజ నిర్వహించారు. 3000 మందికి పైగా భజనమండళ్ల సభ్యులు భజనలు చేసుకుంటూ తిరుమల గిరులను అధిరోహించారు.

చిత్రం..అలిపిరి పాదాల మండపం మొదటి మెట్టు వద్ద పూజలు నిర్వహిస్తున్న వ్యాసరాజమఠం పీఠాధిపతి,
దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి తదితరులు