రాష్ట్రీయం

కడప పెద్దదర్గాకు ఏఆర్ రెహ్మాన్ పూల చాదర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప కల్చరల్, జనవరి 21: కడప నగరంలోని పెద్దదర్గాను సంగీత దర్శకుడు ఏఆర్.రెహ్మాన్ సోమవారం తెల్లవారుజామున దర్శించుకున్నాడు. పెద్దదర్గా ఉరుసు ఉత్సవాల్లో భాగంగా సోమవారం తెల్లవారుజామున గంధం జరిగింది. రాష్ట్రం నుంచేగాక వివిధ రాష్ట్రాల నుంచి వేలాదిగా తరలివచ్చిన ముస్లింలు గంధంలో పాల్గొన్నారు. ఏఆర్.రెహ్మాన్ కుటుంబ సభ్యులతో కలిసి దర్గా పీఠాధిపతి ఆశీస్సులు పొందారు. అనంతరం గంధంలో పాల్గొని ప్రధాన గురువుల మజార్ల వద్ద పూలచాదర్ సమర్పించారు. అక్కడే జరిగిన ఖవ్వాలిలో పాల్గొన్నారు.

చిత్రం..కడప పెద్దదర్గాలో ప్రార్థనలు చేస్తున్న సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్