రాష్ట్రీయం

నేటి నుంచి నౌకాదళ నమూనా విన్యాసాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 21: ముంబయి కేంద్రంగా గతంలో జరిగిన విధ్వంసాలను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్‌లో ఎదురయ్యే పరిణామాలను ఎదుర్కొనేందుకు నమూనా విన్యాసాలను నౌకాదళం మంగళవారం ప్రారంభించనుంది. రెండు రోజుల పాటు తీర ప్రాంతాల్లో జరిగే ఈ విన్యాసాల ద్వారా భవిష్యత్‌లో ముంబయి తరహా దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టే విధానాలు, అందుబాటులోకి వచ్చిన ఆధునిక వ్యవస్థలను ఈ సందర్భంగా ప్రదర్శించనున్నారు. ఎక్సర్‌సైజ్ సీ విజిల్ పేరిట జరిగే అతిపెద్ద తీరప్రాంత విన్యాసాలను నౌకాదళం సమన్వయం చేస్తోంది. 13 రాష్ట్రాల సహా కేంద్రపాలిత ప్రాంతాల్లో విస్తరించిన తీర రక్షణకు సంబందించి నౌకా వాణిజ్య వర్గాలు, మత్స్యకారులు, అనుబంధ ప్రజానీకాన్ని సమన్వయం చేస్తూ ఈ విన్యాసాలు సాగనున్నాయి. నౌకాదళంతో పాటు రక్షణ, హోం, పెట్రోలియం, ఓఎన్‌జీసీ, ఫిషరీస్, కస్టమ్స్ తదితర కేంద్ర ప్రభుత్వ శాఖలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ప్రభుత్వ విభాగాలతో ఈ విన్యాసాలు జరగనున్నాయి. సీ విజిల్ విన్యాసాల ప్రధాన ఉద్దేశం సముద్రంలోను, తీరంలోను ఎదురయ్యే ఉగ్రవాద కార్యకలాపాల నియంత్రణ, అణచివేత వంటి అంశాలుగా ఉండనున్నాయి. నౌకాదళంతో పాటు కోస్ట్‌గార్డ్ సహా రాష్ట్రాల మెరైన్ పోలీసుల సహకారంతో నిర్వహిస్తారు. తీర ప్రాంతంలో కట్టుదిట్టమైన నిఘాతో పాటు ప్రస్తుతం ఉన్న భద్రత చర్యలను మరోసారి పర్యవేక్షిస్తారు. లోపాలను సరిదిద్దుకుంటూనే భవిష్యత్‌లో సాంకేతికంగా ఎదురయ్యే సవాళ్లను సమర్ధవంతంగా ఎదుర్కొనే విధంగా సీ విజిల్ జరుగుతుంది. సీ విజిల్ కార్యక్రమం ద్వారా ప్రస్తుతం అనుసరిస్తున్న భద్రత ప్రమాణాలు, భవిష్యత్‌లో తీసుకోవాల్సిన పటిష్ట చర్యలకు దిక్సూచి కానుంది. తీరం గుండా దేశంలోకి చొరబడే ప్రయత్నం చేసే ముష్కరులను సమర్ధవంతంగా తిప్పికొట్టే విధంగా ఈ విన్యాసాలు దోహదం చేస్తాయని భావన.

నౌకాదళం గతంలో ఎక్సర్‌సైజ్ సీ విజిల్ దృశ్యం (ఫైల్ ఫొటో)