రాష్ట్రీయం

31న వైకాపాలోకి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 22: రాజంపేట నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి ఈ నెల 31న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. మంగళవారం ఆయన తన సోదరులతో కలిసి లోటస్ పాండ్‌కు చేరుకుని జగన్‌తో భేటీ అయ్యారు. ఏపీలోని తాజా రాజకీయ పరిస్థితులు, కడప జిల్లా రాజకీయాలు, పార్టీలో చేరిక తదితర అంశాలపై మంతనాలు జరిపారు. ఈ నెల 31న రాజంపేటలో భారీ బహిరంగ సభ నిర్వహించి, ప్రజల సమక్షంలో పార్టీలో చేరుతానని మేడా మల్లిఖార్జున రెడ్డి జగన్‌తో చెప్పారు. రాజకీయాల్లో నైతిక విలువలు పెంపొందించేందుకు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని జగన్ సూచించారు. అందుకు మేడా ప్రతిస్పందిస్తూ తాను స్పీకర్ ఫార్మాట్‌లోనే రాజీనామా లేఖను అందజేస్తానని చెప్పారు. సమావేశానంతరం మేడా మాట్లాడుత గంజాయి వనం నుంచి తులసి వనంలోకి వచ్చినట్లు ఉందని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య విలువలు లేని చంద్రబాబు నాయుడు వద్ద ఉండలేకపోయానని అన్నారు. అందుకే ఇంతకాలం పార్టీకి దూరంగా ఉన్నానని ఆయన చెప్పారు. ఈ నెల 31న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే పదవికి, ప్రభుత్వ విప్ పదవికి, టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ పార్టీ నాయకత్వానికి లేఖ పంపిస్తానని తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి స్పూర్తితో రాజకీయాల్లోకి వచ్చానని, ఇప్పుడు సొంత ఇంటికి వచ్చినట్లు తృప్తిగా ఉందని అన్నారు.