రాష్ట్రీయం

వేద ఘోష.. ఆధ్యాత్మిక శోభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, జనవరి 22: తెలంగాణ రాష్ట్ర సుభిక్షం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో నిర్వహిస్తున్న శ్రీ మహారుద్ర సహిత సహస్ర చండీయాగం రెండో రోజు శాస్త్రోక్తంగా కొనసాగింది. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం వేదపండితుల వేదఘోషతో ప్రతిధ్వనించింది. మంగళవారం ఉదయం యాగశాలలో ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహం వద్ద సీఎం కేసీఆర్, సతీమణి శోభ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రుత్విక్కులు సీఎం కేసీఆర్ దంపతులకు యాగశాల వద్ద పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. రెండవరోజు చండీయాగంలో కేసీఆర్ తెల్లటి పట్టువస్త్రాలు ధరించగా, రుత్విక్కులు గులాబి వర్ణంలోని వస్త్రాలను ధరించారు. రుత్విక్కుల మంత్రోచ్ఛరణతో ఎర్రవల్లి ఫామ్‌హౌస్ భక్త్భివం అలముకుంది. యాగశాల వద్ద ఏర్పాటు చేసిన పది హోమగుండాలను ఏర్పాటు చేయగా, ఒక్కో హోమ గుండం వద్ద ఎనిమిది మంది రుత్వికులు ఏకోత్తర పద్ధతిలో వేద పారాయణం చేయగా, శృంగేరి పీఠం వద్ద సంప్రదాయాల ప్రకారం వేదమంత్రోచ్ఛరణలు జపిస్తున్నారు. చండీయాగంలో భాగంగా మహాహారతి, మంత్ర పుష్పము, మాధ్యాహ్నిక పూజలు పూర్తిచేశారు. ఉదయం 9 గంటలకు శాంతిపాఠముతో ప్రారంభమైన మహారుద్ర యాగం 41 ఏకాదశ అభిషేకాలు పూర్తిచేశారు. రాజశ్యామల యాగంలో భాగంగా ఉదయం రుత్వికులు రాజశ్యామల అనుష్టానం, హోమం, రాజశ్యామల, మహావిద్య పారాయణం హోమం, సహస్ర నామార్చన నిర్వహించారు. ప్రతి రోజు ఉదయం ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, ఆధర్వణ వేదం, శుక్ల యజుర్వేద పారాయణము, హవననాదులు, సుందరకాండ, విరాటపర్వ, మహాసౌర పారాయణాలు జరుగుతున్నాయ. ఈ కార్యక్రమాలన్ని శృంగేరి పీఠాధిపతులు, శారదా పీఠాధిపతులు దివ్య ఆశీస్సులతో విద్వ దాహితాగ్ని బ్రహ్మశ్రీ మాడ్గుల మాణిక్య సోమయాజులు పర్యవేక్షణలో జరుగుతున్నాయి. పూజా కార్యక్రమాలు వేద పండితులు పురాణం, మహేశ్వర శర్మ, మంగళంపల్లి వేణుగోపాల శర్మ, శాస్తల్ర వెంకటేశ్వరశర్మ, ఫణి శశాంక శర్మ, గంగవరం నారాయణ శర్మ, జి. కామేశ్వర శర్మ, కాసుల చంద్రశేఖరశర్మ నిర్వహణలో అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. రెండవరోజు యాగానికి హోంమంత్రి మహమూద్ అలీ, రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంత్‌రావు, సంతోష్‌కుమార్, బూర్గుపల్లిప్రతాప్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.
చిత్రం..మహారుద్ర చండీయాగంలో భాగంగా అమ్మవారి పూజల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు దంపతులు