రాష్ట్రీయం

ఉత్తమ ఎంపీగా కవిత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 22: ఫేమ్ ఇండియా-ఆసియా పోస్ట్ మేగజైన్ ఆదర్శ్ విభాగం నిర్వహించిన ‘శ్రేష్ట్ సంసద్’ సర్వేలో ఉత్తమ పార్లమెంటు సభ్యురాలిగా నిజామాబాద్ టీఆర్‌ఎస్ ఎంపీ కవిత ఎంపికయ్యారు. ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి కాసర్ల, పలువురు కార్యవర్గ సభ్యులు మంగళవారం ఎంపీ కవితను కలిసి అభినందించారు. నాగేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలైన కవిత తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచ వ్యాప్తంగా తెలియజేసేలా కృషి చేస్తున్నారని అన్నారు. తెలంగాణ మహిళా శక్తిని, మహిళా సాధికారతను దేశం గర్వపడేలా కృషి చేస్తున్నారన్నారు.
కవితను కలిసిన వారిలో అడ్వైజరీ బోర్డు చైర్మన్ డాక్టర్ అనిల్ రావు, వైస్-చైర్మన్ రాజేశ్ రాపోలు, సత్యంరావు, వివిధ రాష్ట్రాల అధ్యక్షులు సాయిరాం, ప్రవీణ్ పిన్నమ, రవి సాయల, శ్రీకాంత్ రెడ్డి, రవి యాదవ్, యువజన విభాగం అధ్యక్షుడు జస్వంత్, మహిళా విభాగం అధ్యక్షురాలు సంగీత తదితరులు ఉన్నారు.