రాష్ట్రీయం

రథసప్తమికి విస్తృత ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జనవరి 22: రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి 12వ తేదీన వేలాది మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ జేఈఓ శ్రీనివాసరాజు వెల్లడించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో మంగళవారం ఆయన అధికారులతో రథసప్తమి ఏర్పాట్లపై సమీక్షించారు. ఈసందర్భంగా శ్రీనివాసరాజు అన్నప్రసాదం, ఆరోగ్యశాఖ, ఇంజినీరింగ్, ఉద్యానవన విభాగం, ఆలయం, శ్రీవారి సేవ, భద్రతా విభాగం, ఎస్వీబీసీ, ధర్మప్రచార పరిషత్ తదితర విభాగాల అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ పర్వదినాన్ని పురస్కరించకుని సూర్యోదయం నుంచి చంద్రోదయం వరకు తిరుమలలో ఏడు వాహనాలపై స్వామివారి ఊరేగింపును తిలకించడానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వివిధ విభాగాధిపతులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అత్యవసర సేవలందించడానికి వీలుగా వైద్యసిబ్బంది, మందులు, అంబులెన్సు వాహనాలను కూడా సిద్ధంగా ఉంచుకోవాలని ఆయన వైద్యాధికారులకు సూచించారు. వాహనసేవలు తిలకించడానికి తిరుమాడ వీధుల్లో భక్తులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు గ్యాలరీలపై పాక్షిక షెడ్ ఏర్పాటు చేయాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. ఉదయం 4 నుంచి రాత్రి 9 గంటల వరకు గ్యాలరీలలో వాహనాలను తిలకించడానికి వేచి ఉండే భక్తులకు తాగునీరు, మజ్జిగ, సాంబారు అన్నం, పెరుగు అన్నం, పులిహోర, పొంగలి వంటి అన్నప్రసాదాలను నిరంతరాయంగా పంపిణీ చేయాలని ఆదేశించారు. పద్మావతి అతిథిగృహాల సముదాయంలో నూతనంగా హరిహర సదన్, సన్నిదానం వద్ద మరొక అతిథిగృహం భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు జేఈఓ చెప్పారు. రథసప్తమిని పురస్కరించుకుని ఆర్జిత సేవలను రద్దు చేసినట్లు వెల్లడించారు. ఆ రోజున ఎటువంటి ప్రత్యేక దర్శనాలు ఉండవన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఈ సందర్భంగా టీటీడీ అధికారులకు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఎఫ్‌ఏ సీఏఓ బాలాజీ, సీఈ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్‌ఈలు రామచంద్రారెడ్డి, వెంకటేశ్వర్లు, ఆరోగ్య విభాగం అధికారి డాక్టర్ శర్మిష్ట, డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.