రాష్ట్రీయం

సంస్కరణలే.. అభివృద్ధికి ఊతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 22: సంస్కరణల ద్వారానే మరింత వేగంగా దేశాభివృద్ధి, పారిశ్రామికవృద్ధి సాధ్యమని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేష్ తెలిపారు. దావోస్‌లో మంగళవారం ప్రారంభమైన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో కంట్రీ స్ట్రాటజీ డైలాగ్ ఆన్ ఇండియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మారుతున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వివిధ రంగాల్లో అభివృద్ధికి రాయితీలు, ప్రత్యేక విధానాలు తీసుకురావాల్సి ఉందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, యువతకు ఉద్యోగాలు కల్పించడం ద్వారా ఇండియా రెండంకెల వృద్ధి సాధించేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయన్నారు. కార్పొరేట్ టాక్స్‌లను తగ్గించాలని, ఎంఎస్‌ఎంఈ కంపెనీలకు శ్లాబ్స్ తరహాలో ప్రత్యేక టాక్స్ విధానం ఉండాలన్నారు. దీని వల్ల చిన్న కంపెనీలకు మేలు జరుగుతుందన్నారు. పరిశోధన, అభివృద్ధి, సృజనాత్మకతకు ప్రత్యేక రాయితీలు ఇవ్వాలని, పన్ను మినహాయింపులు ఇవ్వాలన్నారు. భూములు, పరిశ్రమలకు సంబంధించిన అంశాల్లో జుడీషియల్ సంస్కరణలు అవసరమన్నారు. కార్మిక చట్టాల్లో మార్పులు అవసరమని, భారీగా ఉద్యోగాలు కల్పించడం ద్వారా రెండంకెల వృద్ధి సాధ్యమన్నారు. ఔట్ కమ్ బడ్జెట్ ద్వారా మెరుగైన ఫలితాలు వస్తాయన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో ఏపీ నెంబర్ 1గా ఉందని, దేశం సహా ప్రపంచ దేశాలతో పోటీపడేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. టెక్నాలజీ సాయంతో వ్యవసాయంలో గణనీయమైన ప్రగతి సాధించామని వెల్లడించారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎజైల్ గవర్నెన్సు ఫ్యూచర్ కౌన్సిల్ బృందంతో మంత్రి భేటీ అయ్యారు. టెక్నాలజీ అనుసంధానంతో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు పాలనలో తీసుకురావాల్సిన మార్పుల గురించి చర్చించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వేగంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న మార్పులు, టెక్నాలజీ అనుసంధానం అయ్యేలా పాలనలో మా ర్పులు, కొత్త విధానాలను ప్రభుత్వాలు తీసుకురావాల్సి ఉందన్నారు. ప్రస్తుతం ఏపీలో గవర్నెన్సు 2.0 అమలు చేస్తున్నామని వెల్లడించారు. ఆర్టీజీఎస్ ద్వారా రియల్ టైమ్‌లో సేవలు అందిస్తున్నామన్నారు. ఆర్ట్ఫీషియల్ ఇంటెలిజెన్సు, మెషిన్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్ అనుసంధానం చేసి అనేక ఫలితాలు సాధిస్తున్నామని తెలిపారు. ఆర్టీజీఎస్‌లో ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు కాల్ చేస్తూ వారి సమస్యలను పరిష్కరించడమే కాకుండా, సంతోష సూచిని తెలుసుకుంటున్నామన్నారు. 4వ పారిశ్రామిక విప్లవంలో అధునాతన టెక్నాలజీలను అమలు చేయడంలో అందరికంటే ముందు ఉన్నామన్నారు. భూ వివరాలు డిజిటలైజ్ చేస్తున్నామని, బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా రికార్డులు ట్యాంపర్ కాకుండా రక్షణ కల్పిస్తున్నామన్నారు. డ్రోన్లను వినియోగించి భూసార పరీక్షలు, రహదారుల నాణ్యత తెలుసుకుంటున్నామని వివరించారు. సీఎం కోర్ డ్యాష్ బోర్డు ద్వారా వివిధ శాఖల సమాచారం అందరికీ అందుబాటులో ఉంచడమే కాకుండా, ఆయా శాఖల పనితీరు తెలుసుకుంటున్నామన్నారు. కాగిత రహిత పాలన తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.
మెడికల్ ఎలక్ట్రానిక్స్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సును ఏపీలో ఏర్పాటు చేయండి
మెడికల్ ఎలక్ట్రానిక్స్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సును ఏపీలో ఏర్పాటు చేయాలని విప్రో చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ రిషద్ ప్రేమ్‌జీకి మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. ఎపీలో అధునాతన టెక్నాలజీల అభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో రెండు అమెరికన్ కంపెనీలు పైలట్ ప్రాజెక్టుగా ఉద్యోగాలు కల్పించనున్నాయన్నాయని వివరించారు. నాస్కామ్ ఏర్పాటు చేస్తున్న ఫ్యూచర్ స్కిల్స్ ప్లాట్‌ఫార్మ్ ద్వారా యువతకు శిక్షణ ఇచ్చేందుకు సహకారం కావాలన్నారు. విప్రో, నాస్కామ్‌ల ద్వారా ఏపీ అభివృద్ధికి సహకరిస్తామని రిషద్ హామీ ఇచ్చారు. యువనేస్తంలో రిజిస్టర్ అయిన వారికి శిక్షణ ఇచ్చే కార్యక్రమంతో త్వరలో వస్తామన్నారు. సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సుపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు.
డెలాయిట్ గ్లోబల్ చైర్మన్ డేవిడ్ క్రూక్ శాంక్‌తో జరిగిన చర్చల్లో రాష్ట్ర విభజన సమయంలోని పరిస్థితులు, మూడున్నర ఏళ్లలో సమస్యలను అధిగమించిన తీరు మంత్రి వివరించారు. ప్రస్తుతం 12 శాతం వృద్ధి సాధించామని, 15 శాతం సాధించాలని లక్ష్యంతో పని చేస్తున్నామని వివరించారు. దీనిపై క్రూక్ స్పందిస్తూ, ఏపీ అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తామని తెలిపారు. తుపాన్లు, వరదులు, కరవు పరిస్థితులకు బీమా కల్పించే స్విస్ రే సంస్థ ప్రతినిధులతో కూడా మంత్రి సమావేశమయ్యారు. అనేక దేశాల్లో ప్రకృతి వైపరీత్యాలకు బీమా సౌకర్యం కల్పిస్తున్నామని, ఏపీలో ఈ తరహా బీమా వల్ల నష్టాన్ని తగ్గించుకునే వీలు ఉంటుందని స్విస్ రే రీజినల్ లీడర్ మెన్జింగర్ తెలిపారు.