రాష్ట్రీయం

టీడీపీ, జనసేన కలిస్తే తప్పేంటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 23: టీడీపీ, జనసేన కలిస్తే తప్పేంటి అంటూ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వేడి పుట్టించాయి. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసం వద్ద బుధవారం మీడియాతో టీజీ మాట్లాడుతూ ఉత్తర ప్రదేశ్‌లో ఎస్పీ, బీఎస్పీ కలిసినప్పుడు, ఏపీలో టీడీపీ, జనసేన కలిస్తే తప్పేమిటంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కుర్చీపై ఆశ లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ గతంలో చాలా సార్లు చెప్పారని గుర్తు చేశారు. టీడీపీతో జనసేన కలిసేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. టీడీపీ, జనసేన మధ్య పెద్దగా విభేదాలు లేవన్నారు. కేవలం కేంద్రంపై పోరాటం చేసే విషయంలోనే రెండు పార్టీలకు అభిప్రాయ భేదాలు ఉన్నాయని వివరించారు. వచ్చే ఎన్నికల్లో గెలిచే వాళ్లకే తమ పార్టీ సీట్లు ఇస్తారని, ఈ క్రమంలో తన కుమారుడికి కూడా అవకాశం వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డితో కలిసి ఆయన ముఖ్యమంత్రిని కలిశారు. కర్నూలు అసెంబ్లీ సీటు విషయంలో
సర్వే నివేదికల ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. సర్వేల్లో తన కుమారుడు భరత్‌కు ఎక్కువ ప్రజాదరణ వస్తే, కర్నూలు అసెంబ్లీ సీటు ఇవ్వాలని, ఒక వేళ మోహన్ రెడ్డికి వస్తే, ఆయనకు ఇవ్వాలని సీఎంకు చెప్పినట్లు తెలిపారు.
వ్యక్తిగత ప్రకటనలు తప్పు: మండిపడ్డ చంద్రబాబు
టీడీపీతో జనసేన కలిస్తే తప్పేంటి అంటూ టీజీ వెంకటేష్ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ విధానాలపై వ్యక్తిగత ప్రకటనలు చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. ఈ తరహా ప్రకటనల ద్వారా పార్టీ కార్యకర్తలను ఆయోమయానికి గురి చేయవద్దని హితవు పలికారు. పార్టీ విధానాలపై మాట్లాడేటప్పుడు సంయమనం కోల్పోవద్దని సూచించారు.

చిత్రం..మీడియాతో మాట్లాడుతున్న టీజీ వెంకటేష్