రాష్ట్రీయం

రైల్వే ఉద్యోగాల్లో ఈబీసీ కోటా అమలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 23: రైల్వేశాఖలో ఖాళీ ఉద్యోగాల భర్తీ చేయడానికి ఈనెల ప్రారంభంలో ప్రకటించిన నోటిఫికేషన్‌లో భాగంగా కేంద్రం తాజాగా ప్రకటించిన 10 శాతం ఈబీసీ కోటాను అమలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారులు ప్రకటించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రైల్వేశాఖలో దాదాపు 14వేల ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేయడానకి నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెల్సిందే. రైల్వేశాఖలో జూనియర్ ఇంజనీర్, జూనియర్ ఇన్ఫర్మేషన్, డీఎంఎస్, సీఎంఎస్ వంటి ఉద్యోగాల్లో నియామక ప్రక్రియను పూర్తి చేయనున్నారు. నిరుద్యోగ యువతీయువకు ఉద్యోగాల కోసం ఈనెల 31వ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని రైల్వే శాఖ సూచించింది. వచ్చే ఏప్రిల్, మే నెలల్లో పరీక్షలు ఉంటాయని వివరించింది. జారీ చేసిన నోటిఫికేషన్‌లోని మిగతా అంశాల్లో మార్పు లేదని, ఈబీసీ కోటా అమలవుతుందనే విషయాన్ని చేర్చుకోవాలని పేర్కొంది.