రాష్ట్రీయం

మలివిడత ప్రచారం సమాప్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: గ్రామ పంచాయతీలకు జరుగుతున్న ఎన్నికల్లో భాగంగా రెండోవిడత ఎన్నికలకు సంబంధించి ప్రచారం బుధవారం సాయంత్రం ముగిసింది. దాదాపు వారం, పదిరోజుల పాటు సంబంధిత గ్రామాల్లో సర్పంచ్ స్థానానికి, వార్డు సభ్యుల స్థానాలకు భారీ ఎత్తున ప్రచారం జరిగింది. ఈ నెల 25 న పోలింగ్ నిర్వహిస్తున్నారు. రెండో విడతలో 4137 గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాలకు 36,620 వార్డు సభ్యులస్థానాలకు నోటిఫికేషన్ జారీ అయింది. 4135 సర్పంచ్ స్థానాలకు, 36,602 వార్డు సభ్యుల స్థానాలకు నోటీస్ జారీ చేశారు. 788 సర్పంచ్ స్థానాలకు, 10,317 వార్డుసభ్యుల స్థానాలకు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఐదు సర్పంచ్ స్థానాలకు ఎన్నిక జరగడం లేదు. శుక్రవారం జరిగే పోలింగ్ సందర్భంగా 3342 సర్పంచ్ స్థానాలకు 10,668 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 94 వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదు. 26,191 వార్డులకు 63,480 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.