రాష్ట్రీయం

గాంధీభవన్‌లో సంబరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 23: ప్రియాంకగాంధీని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించడాన్ని హర్షిస్తూ గాంధీభవన్‌లో బుధవారం సంబరాలు జరిగాయి. పార్టీ కార్యకర్తలు బాణసంచా పేల్చి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రియాంక
నియామకంతో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం వస్తుందని కార్యకర్తలు నినాదాలు చేశారు. ప్రియాంకగాంధీ ప్రత్యక్ష, క్రియాశీలక రాజకీయాల్లోకి రావడం పార్టీని మరింత బలోపేతం చేస్తుందని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి వి హనుమంతరావు, పార్టీ సీనియర్ నాయకుడు మర్రి శశీధర్‌రెడ్డి పాల్గొన్నారు. ప్రియాంకగాంధీ నియామకం హర్షనీయమని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ ఆర్‌సి కుంతియా ఒక ప్రకటనలో స్వాగతించారు.