రాష్ట్రీయం

ముగ్గురు కార్పొరేటర్లపై అనర్హత వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, జనవరి 23: రాష్ట్ర శాసనమండలిలో పార్టీ ఫిరాయించిన వారిపై అనర్హత వేటు వేసినట్లుగానే ఖమ్మం కార్పొరేషన్‌లో కూడా పార్టీ మారిన ముగ్గురిపై అనర్హత వేటు వేయాలని తీర్మానం చేశారు. రాష్ట్రంలోనే తొలిసారిగా జరిగిన ఈ అంశంపై రాష్ట్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. టీఆర్‌ఎస్ మినహా ఇతర పార్టీల నేతలు ఇది అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నప్పటికీ అధికార పార్టీ నేతలు తాము అనుకున్న పనిని యథాతథంగా చేసుకుంటూపోతున్నారు. ఖమ్మం కార్పొరేషన్‌లో 50మంది కార్పొరేటర్లు ఉండగా అన్ని పార్టీల నుండి వచ్చిన వారితో కలిపి టీఆర్‌ఎస్‌కు 43మంది, కాంగ్రెస్‌కు 3, సిపిఎం-2, సిపిఐ-2మంది కార్పొరేటర్లు ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్ సభ్యులుగా ఉన్న ముగ్గురు తెలుగుదేశం పార్టీలో చేరారు. దీంతో ఆ ముగ్గురిపై అనర్హత వేటు వేయాలంటూ బుధవారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో తీర్మానం చేశారు. 6వ డివిజన్‌కు చెందిన హనుమంతు, 7వ డివిజన్‌కు చెందిన చేతుల నాగేశ్వరరావు, 48వ డివిజన్‌కు చెందిన తోట రామారావులు అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరారు. అప్పటి నుండి మాట్లాడకుండా ఉన్న టిఆర్‌ఎస్ నేతలు కౌన్సిల్ సమావేశంలో సంతాప, అభినందనల తీర్మానాల తర్వాత టేబుల్ ఎజెండాగా ఈ అంశాన్ని తీసుకువచ్చారు. ఈ సమయంలో ఆ ముగ్గురు కార్పొరేటర్లకు కాంగ్రెస్ కార్పొరేటర్లు మద్దతు ఇచ్చినప్పటికీ టీఆర్‌ఎస్ కార్పొరేటర్లు పట్టుపట్టి తీర్మానాన్ని ఆమోదింప చేసుకున్నారు. స్థానిక శాసనసభ్యడు పువ్వాడ అజయ్‌కుమార్, ఎమ్మెల్సీలు బాలసాని లక్ష్మీనారాయణ, పొంగులేటి సుధాకర్‌రెడ్డిల సమక్షంలోనే ఈ తీర్మానం జరిగింది. అయితే గతంలో తెలుగుదేశం, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీల నుండి టీఆర్‌ఎస్‌లో చేరిన కార్పొరేటర్లపై అనర్హత ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. అయితే దానికి సమాధానం చెప్పకుండానే ముగ్గురిపై అనర్హత తీర్మానాన్ని అమోదించారు. కాగా శాసన మండలిలోలాగా ఖమ్మం కార్పొరేషన్‌లో కూడా తమను విబేధించినవారిపై వేటు వేయటం దారుణమని, దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ముగ్గురు కార్పొరేటర్లు వెల్లడించారు.