రాష్ట్రీయం

గిరిజన గురుకుల విద్యార్థులకు ఇస్రో ఉపగ్రహ ప్రయోగంపై అవగాహన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 23: గిరిజన గురుకుల విద్యార్థులకు ఇస్రో ఉపగ్రహ ప్రయోగంపై అవగాహన కల్పించే కార్యక్రమాన్ని నిర్వహించినట్టు గిరిజన గురుకులాల సంయుక్త డైరెక్టర్ డాక్టర్ ఈ నవీన్ నికోలస్ చెప్పారు. రాష్ట్రంలోని 314 ఆశ్రమ పాఠశాలలు నిర్వహిస్తున్నామని, ఇందులోని విద్యార్థులకు నిపుణుల ద్వారా ఆన్‌లైన్ ద్వారా పాఠాలలను అందించేందుకు గిరిజన సంక్షేమ కమిషనర్ కార్యాలయంలో ఉపగ్రహ ఆధారిత ఇ స్కూల్ సెంట్రల్ స్టుడియో ఏర్పాటు చేశామని అన్నారు. ఈ నెల 24న ఇస్రో పీఎస్‌ఎల్‌వీ -సీ 44 మిషన్‌ను చేపట్టనుందని, దానిని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు అవగాహన కల్పించాలని నిర్ణయించామని అన్నారు. ఈ ఏడాది సుమారు 17 మిషన్స్‌ను ఇస్రో నిర్వహించనుందని, ప్లానిటరీ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వ్యరంలో ఇ స్కూల్ సెంట్రల్ స్టుడియో ద్వారా ప్రముఖ ఖగోళ పరిశోధకుడు పీఎస్‌ఐ డైరెక్టర్ ఎన్ రఘునందన్ విద్యార్థులకు అవగాహన కల్పించారని అన్నారు. 27 జిల్లాలకు చెందిన గిరిజన ఆశ్రమ విద్యార్థులు అంతా దీనిని ప్రత్యక్షంగా తిలకించారని, ఈ అవగాహన సదస్సులో ఇస్రో నుండి సేకరించిన వీడియోలు, చిత్రాలు , పీఎస్‌ఎల్‌వీ -సీ 44 ఉపగ్రహానికి చెందిన ప్రయోగ క్రమం వివరాలను విద్యార్థులకు అందించామని అన్నారు. తద్వారా విద్యార్థుల్లో శాస్ర్తియ దృక్పథాన్ని పెంచి భవిష్యత్‌లో శాస్తవ్రేత్తలుగా తీర్చిదిద్దే అవకాశం ఉందని పేర్కొన్నారు.
సాంఘిక గురుకులాల్లో ప్రవేశాలు
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ ఆధ్వర్యంలో 2019-20 విద్యాసంవత్సరానికి గానూ ఇంటర్ ఫస్టియర్‌తో పాటు ఐఐటీ జేఈఈ , నీట్, ఎమ్సెట్, క్లాట్‌లకు కోచింగ్ కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు ప్రాంతీయ సమన్వయ అధికారి ఎం రమాదేవి చెప్పారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు గురుకులాల అధికారులు డీ ఉమామహేశ్వరి (8008003630), పీ అపర్ణ (9704550192), జీ జయశ్రీ(8008885026)లను సంప్రదించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని రమాదేవి వివరించారు.