రాష్ట్రీయం

విధి నిర్వహణలో ఆర్టీసీ డ్రైవర్‌కు గుండెపోటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దపల్లి, జనవరి 23: గోదావరిఖని నుంచి హైదరాబాద్‌కు ఆర్టీసీ బస్సు నడుపుతున్న డ్రైవర్ మహేందర్‌కు మార్గమధ్యంలోనే గుండె నొప్పి రావడంతో అప్రమత్తమై బస్సును పక్కకు ఆపి 52 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడి.. స్టీరింగ్ మీదనే కుప్పకూలిపోయిన సంఘటన బుధవారం పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. గోదావరిఖని డిపోకు చెందిన టీఎస్ 22జెడ్-0034 గల ఆర్టీసీ బస్సు ఉదయం గోదావరిఖని నుండి వయా 8ఇన్ కాలనీ మీదుగా 52మంది ప్రయాణికులతో హైదరాబాద్‌కు వెళ్తోంది. మండలంలోని రాఘవాపూర్ సమీపంలోకి రాగానే ఆర్టీసీ డ్రైవర్ మహేందర్‌కు ఛాతిలో నొప్పి రావడంతో బస్సును ఆపి ప్రయాణికులను రక్షించాడు. అదే బస్సులో ప్రయాణిస్తున్న సింగరేణికి చెందిన డాక్టర్ చంద్రశేఖర్‌రావు బస్సులోనే డ్రైవర్‌కు ప్రథమ చికిత్స అందించారు. తర్వాత మహేందర్‌ను జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రికి సురక్షితంగా తరలించారు.
ఆక్సిజన్‌కు బదులు నెబ్‌లైజరా..!
ఆర్టీసీ డ్రైవర్‌కు చాతిలో నొప్పి తీవ్రతరం కావడంతో జిల్లా ప్రధాన ఆసుపత్రిలో కనీస వైద్య సదుపాయాలు లేవని డాక్టర్ చంద్రప్రకాశ్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. కనీసం ఆక్సిజన్ కూడా అందుబాటులో లేదని వాపోయారు. ఈసీజీ తీయాలని డ్యూటీ డాక్టర్‌ను కోరగా టెక్నీషియన్ అందుబాటులో లేడని సమాధానం చెప్పారని, ఆక్సిజన్ బదులు నెబ్‌లైజర్ పెట్టడం ఏమిటని సింగరేణికి చెందిన డాక్టర్ చంద్రశేఖర్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి చెందిన అంబులెన్స్‌లో కరీంనగర్‌కు తరలించే క్రమంలో అంబులెన్స్‌కు డీజిల్ డబ్బులు కూడా చెల్లించామన్నారు. బస్సులో ప్రయాణిస్తున్న డాక్టరే ఆర్టీసీ డ్రైవర్ ప్రాణాలు కాపాడారని, ఆయన ప్రథమ చికిత్స అందించకుంటే ఆర్టీసీ డైవర్ ప్రాణాలు పోయేవని, బస్సులోని ప్రయాణికులు డాక్టర్‌ను అభినందించారు.

చిత్రం..ఆర్టీసీ డ్రైవర్ మహేందర్‌ను అంబులెన్స్‌లో కరీంనగర్‌కు తరలిస్తున్న దృశ్యం