రాష్ట్రీయం

ఆస్తుల రిజిస్ట్రేషన్లకు ‘ఆధార్’ తప్పనిసరి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమండ్రి, డిసెంబర్ 2: భూములు, ఇతర వ్యవహారాల రిజిస్ట్రేషన్లకు ఆధార్ కార్డును విధిగా జత చేయాలన్న నిబంధన కచ్చితంగా అమలవుతోంది. ఈ నిబంధన చాలా కాలం నుండే అమలులో ఉన్నప్పటికీ, అంతగా పట్టించుకోని రిజిస్ట్రేషన్ అధికారులు గత 15రోజులుగా ఆధార్ కార్డును తప్పనిసరిచేశారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో ఆధార్ నంబరును వినియోగించకపోతే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ముందుకు సాగటం లేదని, ఆధార్ నంబరును ఫీడ్ చేయకపోతే ఆన్‌లైన్ విధానంలో తరువాత కార్యక్రమం నడవటం లేదని రిజిస్ట్రేషన్ల అధికారులు చెబుతున్నారు. ఆస్తులు, ఇతర వ్యవహారాలు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకునే వారు విధిగా ఆధార్ కార్డు జిరాక్స్ కాపీని సమర్పించాలని రిజిస్ట్రేషన్ అధికార్లు కోరుతున్నారు.
ఆధార్ లింకుతో రిజిస్ట్రేషన్ల కార్యక్రమం బాగానే ఉన్నప్పటికీ, చదువు అంతగా లేని గ్రామీణ ప్రాంత ప్రజలతో పాటు, వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రజలు కొంత ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తోంది. కొంత మంది ఆధార్ కార్డులో ఉన్న వివరాలకు, ఆస్తులకు సంబంధించిన పత్రాల్లో ఉన్న వివరాలకు మధ్య పొంతన ఉండటం లేదు. అక్షరాస్యత లేకపోవటంతో దస్తావేజుల్లో పేర్లు, ఇతర వివరాలను సరిగా రాయించుకోలేకపోయిన వారు, ఆధార్ కార్డులో వివరాలు సక్రమంగా ఉందో లేదో చూసుకోలేని వారు రిజిస్ట్రేషన్ల సమయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగని ఆధార్ కార్డులోని వివరాలు, దస్తావేజుల్లో వివరాలు ఒకేలా లేకపోతే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏ మాత్రం ముందుకు సాగటం లేదు. అయితే చిన్న చిన్న పొరపాట్లను సరిచేసి రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ముందుకు నడిపించేందుకు రిజిస్ట్రేషన్ అధికారులకు అధికారం ఇచ్చినప్పటికీ, రిజిస్ట్రేషన్ల అధికారుల పరిధిని దాటి ఆధార్ కార్డుల్లో లేక దస్తావేజుల్లో తేడాలు ఉంటున్నాయి. దాంతో ఆధార్ లింకుతో రిజిస్ట్రేషన్ల విధానం కొంత ఇబ్బంది కలిగిస్తోందని జనం ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

పీఎల్‌జీఏ
వారోత్సవాల్లో

తొలి రోజు హింసాత్మకం

భద్రాచలం, డిసెంబర్ 2: పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పిఎల్‌జిఎ) వారోత్సవాల నేపథ్యంలో తొలిరోజు బుధవారం ఛత్తీస్‌గఢ్, ఒడిషా, తెలంగాణ, ఆంధ్రా సరిహద్దుల్లోని దండకారణ్యంలో చోటు చేసుకున్న సంఘటనలతో వాతావరణం హింసాత్మకంగా మారింది. సుకుమా జిల్లా డోర్నపాల్ పోలీసుస్టేషన్ పరిధిలోని చింతలనార్ పోలీసు బేస్‌క్యాంప్‌ను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు దాడి చేశారు. సుమారు 150 మంది సాయుధ మావోయిస్టులు క్యాంపును చుట్టుముట్టి కాల్పులకు తెగబడ్డారు. వీరిని బేస్ క్యాంపులోని పోలీసులు సమర్థవంతంగా ప్రతిఘటించడంతో ప్రమాదం తప్పింది. మరోవైపు కోయిలీబేడ పోలీసుస్టేషన్ పరిధిలోని బర్కనార్ గ్రామం వద్ద కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసు బలగాలను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు మందుపాతర పేల్చడంతో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వీరిద్దరిని రాజధాని రాయపూర్‌కు తరలించారు. వీరిలో బైజూరామ్ అనే జవాను పరిస్థితి విషమంగా ఉంది. బస్తర్ ఐజీ కల్లూరి సమక్షంలో ముగ్గురు మావోయిస్టులు లొంగిపోయారు. కోశిమర్కామ్ అనే ప్లాటూన్ నెం.26 డివిజన్ కమిటీ సభ్యుడు, జన మిలీషియా సభ్యుడు సంతరామ్‌కుండల్, బార్‌సూర్ జన మిలీషియా కమిటీ సభ్యుడు రామ్‌బతి కొర్రామ్ లొంగిన వారిలో ఉన్నారు. వీరిపై రూ.2 లక్షల మేర రివార్డులు ఉన్నాయి. కాంకేర్ జిల్లాలోని సిక్సోడ్ పోలీసుస్టేషన్ పరిధిలో మాంజీ కుర్సుబోడీ అనే గ్రామంలో ముగ్గురు మావోయిస్టులను పోలీసు బలగాలు అరెస్టు చేశాయి. ఇదిలా ఉండగా ఒడిషాలోని మల్కన్‌గిరి జిల్లాలోని కలిమెల పోలీసుస్టేషన్ పరిధిలో కూంబింగ్ బలగాలు ఆరుగురు మిలీషియా కమాండర్లను అరెస్టు చేశాయి. వారు సుద్దకొండ, రాజులకొండ, కురువు గ్రామాలకు చెందిన మిలీషియా కమాండర్లుగా కలిమెల పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు తెలంగాణలోని ఖమ్మం జిల్లా భద్రాచలం పట్టణ శివారు గ్రామాల్లో మావోయిస్టులు కరపత్రాలు విడుదల చేసి సంచలనం సృష్టించారు. తొలిరోజు వారోత్సవాల్లో మావోయిస్టులు దుందుడుకుతనాన్ని ప్రదర్శించడం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

వారసత్వ నగర నిర్మాణానికి

5న శంకుస్థాపన

అమరావతి, డిసెంబర్ 2: కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 12 వారసత్వ నగరాల్లో అమరావతి కూడా ఎంపికైందని, ఈ నగర అభివృద్ధి కోసం హృదయ్, ప్రసాద్ పథకాల కింద 70 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని, తొలివిడతగా 26.11 కోట్ల రూపాయలు విడుదలయ్యాయని జిల్లా కలెక్టర్ కాంతిలాల్‌దండే తెలిపారు. ఈ నెల 5న వారసత్వనగర నిర్మాణ పనులను ప్రారంభించేందుకై ఏర్పాటు చేస్తున్న పైలాన్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, నితిన్‌గడ్కరీ, శర్మ తదితరుల చేతుల మీదుగా ఆవిష్కరించడం జరుగుతుందని తెలిపారు. ఈ మేరకు అమరావతిలో ముఖ్యమంత్రి, కేంద్రమంత్రుల పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ కాంతిలాల్ దండే, జాయింట్ కలెక్టర్లు సిహెచ్ చెరుకూరి, ముంగా వెంకటేశ్వరరావుతో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు ధ్యానబుద్ధ ప్రాజెక్టు ప్రాంగణాన్ని బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కాంతిలాల్ దండే విలేఖర్లతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిధులతో అమరావతి పట్టణాన్ని జాతీయస్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.
ధ్యానబుద్ధ ప్రాజెక్టుకు వెళ్లేమార్గంలో పైలాన్‌ను ఏర్పాటు చేయాలని సాంఘిక సంక్షేమశాఖ జెడిఎ ఆర్ మల్లికార్జునరావు రూపొందించిన పైలాన్ నమూనాను పరిశీలించి ఈ రోజు నుండే నిర్మాణ పనులు ప్రారంభించాలని ఆదేశించారు.
ప్రధానంగా మహాస్థూపం, పురావస్తు ప్రదర్శనశాల, ధ్యానబుద్ధ ప్రాజెక్టు అమరేశ్వరాలయాలను ఈ బృందం పరిశీలిస్తుందని, కేంద్ర ప్రభుత్వ నిధులతో ప్రత్యేక ఏజెన్సీల ద్వారా చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను కూడా నిర్ణయించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.