రాష్ట్రీయం

179 రోజుల్లో భవన నిర్మాణమా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: రాష్ట్ర రాజధాని అమరావతి పరిధిలో ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ ఆదివారం బిజీబిజీగా గడిపారు. విజయవాడకు శనివారం చేరుకున్న ఆయన రాజధాని ప్రాంతంలోని నేలపాడు వద్ద నిర్మించనున్న ఏపీ హైకోర్టు శాశ్వత భవనాలకు శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. అనంతరం జ్యుడీషియల్ కాంప్లెక్సును ప్రారంభించారు.
తాత్కాలిక హైకోర్టు నిర్మాణ విశేషాలను ఆడియో, వీడియో ప్రజంటేషన్ ద్వారా అధికారులు ఆయనకు వివరించారు. అమరావతి నగర నిర్మాణ నమూనాలను ఆసక్తిగా తిలకించారు. హైకోర్టు, శాసనసభ, 9నగరాల గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరించారు. రాజధానిలో వర్సిటీల ఏర్పాటు గురించి అధికారులను జస్టిస్ గొగోయ్ అడిగి తెలుసుకున్నారు. తాత్కాలిక హైకోర్టు ఆవరణ పరిధిలో 100 అడుగుల ఎత్తుల ఏర్పాటు చేసిన జాతీయ జెండాను జస్టిస్ గొగోయ్ ఆవిష్కరించారు. తాత్కాలిక హైకోర్టు భవనంలో ప్రవేశద్వారం సమీపంలో గోడపై ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ నిలువెత్తు విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. తాత్కాలిక హైకోర్టులోని వివిధ హాళ్లను సందర్శించారు. రెండో అంతస్తులోని కోర్టు హాల్‌ను కూడా పరిశీలించారు. 179రోజుల్లో భవన నిర్మాణం పూర్తిచేయడంపై ఆశ్చర్యం, హర్షం వ్యక్తం చేశారు. అంతకుముందు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. బహిరంగ సభ ముగిసిన అనంతరం ఆయన హెలికాప్టర్‌లో అమరావతి రాజధాని నిర్మాణ ప్రాంతాలను వీక్షించారు. ఈ పర్యటనలో ఆయన వెంట దీపాంజలీ గొగోయ్ కూడా ఉన్నారు. కాగా తాత్కాలిక హైకోర్టుగా వ్యవహరించే జ్యుడీషియల్ కాంప్లెక్సును 4.6 ఎకరాల్లో నిర్మించారు. 2.65 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం వచ్చేలా నిర్మించారు. 22 కోర్టులు, జడ్జిల చాంబర్లను, గ్రంథాలయం, బార్ రూమ్, అడ్వకేట్ల చాంబర్ల వంటివి దీనిలో ఏర్పాటు చేశారు.

చిత్రం.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్‌కు జ్ఞాపిక
బహూకరిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు