రాష్ట్రీయం

యూ టర్న్ సీఎం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు), ఫిబ్రవరి 4: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు యూ టర్న్ తీసుకున్న సీఎం అని బీజెపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పేర్కొన్నారు. కేంద్రంలో ఎన్‌డీఏతో తెగతెంపులు చేసుకున్న చంద్రబాబును ఎప్పటికీ ఎన్‌డీఏ గడప తొక్కనివ్వమన్నారు. ఇది నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇస్తున్న మాటగా ఆయన పేర్కొన్నారు. విజయనగరంలో సోమవారం విజయనగరం, విశాఖపట్టణం, అరకు, అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గాలకు చెందిన ఉత్తరాంధ్ర శక్తికేంద్ర ప్రముఖులతో నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్‌షా మాట్లాడుతూ దివగంగత ప్రధాని వాజపేయి ప్రధానిగా ఉన్నప్పుడు అప్పట్లో ఎన్‌డీఏలో భాగస్వామిగా ఉంటూ చంద్రబాబు మోసం చేశారన్నారు. ఇప్పుడు ప్రధాని నరేంద్రమోదీ పదేళ్లు ప్రధానిగా ఉంటారని తెలిసి ఎన్‌డీఏతో జత కట్టారని, అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాల్లో పెద్దఎత్తున అవినీతి జరుగుతోందని ప్రజలు గమనించడంతో ఎన్‌డీఏతో తెగతెంపులు చేసుకున్నారని ఆరోపించారు. అవకాశవాద రాజకీయాలకు చంద్రబాబు నిలువెత్తురూపమని, అభివృద్ధి కంటే అవినీతితోనే చంద్రబాబుకు ఎక్కువగా సంబం ధం ఉందని విమర్శించారు. జాతీయస్థాయి ఖ్యాతిగాంచిన 20 ఉన్నత విద్యాసంస్థలను ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేశామని, వైద్యవిద్యలో 900 సీట్లను ఆంధ్రాకు కేటాయించామని, ప్రధాని మోదీ ఏపీకి అన్యాయం చేశారని చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని అమిత్‌షా మండిపడ్డారు. ఏ పార్టీ అయితే రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసిందో అదే పార్టీతో తెలంగాణలో జత కట్టారన్నారు. కాంగ్రెస్‌కు ప్రజలు దూరమవుతున్న విషయాన్ని గమనించి, అప్పుడు ఆ పార్టీని వదిలి జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీలను ఏకం చేసి చక్రం తిప్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. విభజన చట్టంలో ఇచ్చిన 14 అంశాల్లో ఇప్పటికే పది అంశాలను పూర్తిచేశామని, ఇంకా నాలుగు మాత్రమే ఉన్నాయని ఆయన చెప్పారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి లక్షా 17 వేల కోట్ల రూపాయలు ఇస్తే, అయిదేళ్ల ఎన్‌డీఏ పాలనలో అయిదు లక్షల 56వేల కోట్ల రూపాయలు కేటాయించిందని అన్నారు. దీనిని విస్మరించిన చంద్రబాబుకు బీజేపీ కంటే కాంగ్రెస్ ముద్దుగా కనిపిస్తుందని విమర్శించారు.