రాష్ట్రీయం

‘పసుపు-కుంకుమ’లో రాజకీయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, ఫిబ్రవరి 4: అనంతపురం జిల్లాలో ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపట్టిన పసుపు కుంకుమ కార్యక్రమంలో రెండవ రోజూ ఉద్రిక్తత చోటుచేసుకుంది. మంత్రి పరిటాల సునీత సొంత నియోజకవర్గం రాప్తాడులో చేపట్టిన చంద్రన్న పసుపు-కుంకుమ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న గ్రామాల్లో పోలీసు బందోబస్తుతో చెక్కుల పంపిణీ చేపట్టగా వైకాపా శ్రేణులు అడ్డుకున్నాయి. రాప్తాడు మండలం ప్రసన్నాయపల్లి, గొందిరెడ్డిపల్లిలో సోమవారం జరిగిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఉదయం రాప్తాడు మండలం ప్రసన్నాయపల్లిలో జరిగిన చెక్కుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి సునీత రాగా వైకాపాకు చెందిన డ్వాక్రా సంఘాల మహిళలు
అడ్డుకున్నారు. పోలీసులు పరిస్థితిని అదుపు చేసి కార్యక్రమాన్ని కొనసాగించారు. మధ్యాహ్నం అదే మండలంలోని గొందిరెడ్డిపల్లిలో మంత్రి సోదరుడు ధర్మవరపు మురళి, రాప్తాడు ఎంపీడీఓ, ఇతర ప్రభుత్వ అధికారులు పసుపు-కుంకుమ చెక్కుల పంపిణీ చేపట్టగా వైకాపా మహిళలు, కార్యకర్తలు అడ్డుకున్నారు. కార్యక్రమం ముగిసిన అనంతరం గ్రామంలోని టీడీపీ కార్యకర్తలు చంద్రబాబు విగ్రహానికి పాలాభిషేకం చేసి, టీడీపీకి ఓట్లు వేయాలని ప్రమాణం చేయాలని చెప్పడంతో వైకాపా డ్వాక్రా మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాదనకు దిగారు. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. రెచ్చిపోయిన మహిళలు రాళ్లు, చెప్పులు విసిరారు. రాప్తాడు పోలీసులు, స్పెషల్ పార్టీ పోలీసులు వజ్ర వాహనంతో గొందిరెడ్డిపల్లికి చేరుకున్నారు. వైకాపా వారిని చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. మహిళలు రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వం, మంత్రి సునీతకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అడ్డుకోబోయిన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. టీడీపీ కార్యకర్తలు, పోలీసు కాన్వాయ్‌పైనా రాళ్లు రువ్వడంతో పరిస్థితి చేయిదాటిపోయింది. రాళ్లదాడిలో కానిస్టేబుల్ జయచంద్రారెడ్డి తలకు గాయమైంది. పరిస్థితి చేయిదాటిపోడవంతో పోలీసులు లాఠీచార్జి జరిపారు. ఈ ఘటనలో పలువురు వైకాపా కార్యకర్తలకు గాయాలయ్యాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు వజ్ర వాహనం నుంచి పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. కార్యకర్తలను పోలీసులు తరిమివేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న మంత్రి సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ గొందిరెడ్డిపల్లి వస్తుండగా మార్గమధ్యంలోనే పోలీసులు అడ్డుకుని వెనక్కు పంపించారు.
చిత్రాలు.. రాళ్లదాడిలో గాయపడిన కానిస్టేబుల్
*అనంతపురం జిల్లా రాప్తాడు మండలం గొందిరెడ్డిపల్లిలో పోలీసులతో వైకాపా కార్యకర్తల వాగ్వాదం