రాష్ట్రీయం

వౌని అమావాస్యకు పోటెత్తిన భక్తజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, ఫిబ్రవరి 4: శైవం, వైష్ణం అనే తేడా లేకుండా వౌని అమాస్యను పురస్కరించుకుని పవిత్రమైన నదీ స్నానం ఆచరించడానికి లక్షలాది మంది భక్తులు తరలి రావడంతో ఉమ్మడి మెదక్ జిల్లా గుండా ప్రవహిస్తున్న మంజీర నది పరిహాక ప్రాంతమంతా జనంతో క్రిక్కిరిసిపోయింది. కర్నాటక రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన న్యాల్‌కల్ మండలం మొదలుకుని మెదక్, నిజామాబాద్ జిల్లాల సరిహద్దు ప్రాంతం వరకు మంజీర నదిలోని ఆయా ప్రాంతాల్లో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించడానికి తరలి వచ్చారు. మంజీర నది తీరంలో వెలసిన న్యాల్‌కల్ మండలంలోని రాఘవాపూర్‌లోని సరస్వతి మందిరం, సింగూర్ ప్రాజెక్టు, మంజీర బ్యారేజ్, శివ్వంపేట వంతెనల ప్రాంతాలకు భక్తులు ఉదయం నుండే దారి కట్టారు. మెదక్ జిల్లా చిలప్‌చెడ్ మండలం చిట్కుల్ గ్రామ శివారులో ఉత్తర వాహిణీగా ప్రవహిస్తున్న మంజీర నది పరివాహక ప్రాంతంలో వెలసిన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి చాముండేశ్వర్వీ మాత ఆలయానికి వేలాది మంది భక్తులు తరలి వచ్చారు. మంజీర నదిలో అంతంత మాత్రంగానే ఉన్న నీటిలో స్నానాలు ఆచరించి చాముండేశ్వరీ మాత దర్శనానికి క్యూ లైన్లు కట్టారు. భక్తుల తాకిడిని అంచనా వేసిన ఆలయ కమిటీ ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా అన్ని చర్యలు చేపట్టారు. సంగారెడ్డి, మెదక్ ప్రధాన రహదారి ప్రక్కన ఆలయం ఉండటంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా చిలప్‌చెడ్ పోలీసులు తగిన చర్యలు చేపట్టారు. భక్తులను ఆకర్షించడానికి వెలసిన దుకాణాలను సైతం రోడ్డుకు దూరంగా ఏర్పాటు చేయించి అసౌకర్యాన్ని తొలగించారు. తెలంగాణ రాష్ట్రానికే తలమానికంగా నిలుస్తూ సంప్రదాయాలను ప్రతిభింపజేస్తున్న పాపన్నపేట మండలం నాగ్‌సాన్‌పల్లి గ్రామ శివారులోని ఏడుపాయల్లో వెలసిన వన దుర్గా దర్శనానికి లక్ష మందికి పైగా భక్తులు ఒక్క సోమవారం రోజునే వచ్చి దర్శించుకోవడం విశేషం. మంజర నదిలో నీటి కొరత ఉన్నప్పటికీ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో షవర్ బాత్‌లు ఏర్పాటు చేయడమే కాకుండా నదిలోని మడుగుల్లో ఉన్న నీటిని మోటార్ల సహయంతో దిగువన ఉన్న చెక్‌డ్యాం నింపడంతో భక్తులు ఏలాంటి ఇబ్బందులు లేకుండా పుణ్య స్నానాలు ఆచరించి అమ్మవారిని తనివితీర దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. చెక్ డ్యాం, షవర్ బాత్‌లే కాకుండా ఏడు పాయల్లో ఉన్న నీటి మడుగుల్లో తమకు అనుకూలంగా ఉన్న ప్రాంతాలకు వెళ్లి స్నానాలు చేయడం విశేషం. హైదరాబాద్, సంగారెడ్డి ప్రాంతాల నుండి వచ్చే భక్తులు కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి శివారులోని రోడ్డు గుండా వెళ్లగా మూడవ వంతెన వద్ద పార్కింగ్ ఏర్పాటు చేసి భక్తులను కాలినడకన పంపించారు. మెదక్, బొడ్మట్‌పల్లి నుండి నాగ్‌సాన్‌పల్లి మీదుగా వచ్చే భక్తులను క్షేత్రానికి సమీపంలో ఏర్పాటు చేసిన పార్కింగ్ వద్ద వాహనాలను నిలిపి భక్తులను నడకదారిలో పంపించారు. ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారు. ఏడుపాయల దేవస్థాన కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి కమిటీ సభ్యులతో కలిసి పర్యవేక్షించారు. దక్షిణ కాశీగా ప్రసిద్ది చెందిన ఝరాసంగం కేతకి సంగమేశ్వర స్వామి ఆలయానికి తెల్లవారుజామునుండే భక్తుల తాకిడి మొదలైంది. పవిత్రమైన అమృతగుండంలో పుణ్య స్నానాలు చేసిన భక్తజనం స్వామి వార్లను దర్శించుకోవడానికి క్యూలైన్లో బారులు తీరారు.

చిత్రం..ఏడుపాయల స్వర్గ్ధామం వద్ద మంజీర నదిపై నిర్మించిన చెక్‌డ్యాం వద్ద పుణ్య స్నానాలు ఆచరిస్తున్న భక్తులు