ఆంధ్రప్రదేశ్‌

ఒడిశా, చత్తీస్‌గఢ్‌లకు తరలిపోతున్న రేషన్ బియ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, ఏప్రిల్ 1: విజయనగరం జిల్లానుంచి సబ్సిడీ బియ్యం పొరుగున ఉన్న ఒడిశా, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాలకు అక్రమంగా తరలిపోతోంది. ఆ రాష్ట్రాల నుంచి గుట్కా, సిగరెట్లు, మద్యం జిల్లాకు తరలివస్తున్నాయి. సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో అక్రమ రవాణా నిరాటంకంగా సాగుతోంది. జిల్లాలోని విజయనగరం పట్టణంతోపాటు గజపతినగరం, బొబ్బిలి, పార్వతీపురం, నెల్లిమర్ల, చీపురుపల్లి, కొత్తవలస, శ్రీకాకుళం జిల్లాలోని మరికొన్ని ప్రాంతాల నుంచి ప్రభుత్వం పేదలకు అందచేస్తున్న సబ్సిడీ బియ్యాన్ని దళారీలు సేకరించి అక్రమంగా ఒడిశా, ఛత్తీస్‌గడ్ రాష్ట్రాలకు అక్రమంగా తరలిస్తున్నారు. స్థానికంగా కిలో రూపాయికి బియ్యం లభిస్తుండగా కొందరు వ్యక్తులు తెల్లరేషన్ కార్డుదారుల నుంచి రూ. 8 నుంచి రూ.10కి కొనుగోలు చేసి అక్రమంగా తరలిస్తున్నారు. ఒడిశాలో మన బియ్యానికి మంచి డిమాండ్ ఉండటంతో అక్కడికి ఎక్కువ మొత్తంలో తరలిస్తున్నట్లు సమాచారం. ఇక్కడ కిలో రూ.10కి కొనుగోలు చేసిన బియ్యాన్ని ఒడిశా, ఛత్తీస్‌గడ్‌లో రూ. 15 నుంచి రూ.25కి విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని వివిధ రైల్వేస్టేషన్ల నుంచి ప్యాసింజర్ రైళ్లలో బియ్యం అక్రమ రవాణా జరుగుతోంది. బియ్యం అక్రమ రవాణాపై అధికారులకు సమాచారం అందిన సందర్భాల్లో మొక్కుబడిగా దాడులు జరిపి కేసులు బనాయించి చేతులు దులిపేసుకోవటంతో అక్రమ రవాణాదారులు మళ్లీ తమ దందా కొనసాగిస్తున్నారు. ఇకపోతే ఛత్తీస్‌గడ్, ఒడిశా నుంచి మద్యం, సిగరెట్లు, గుట్కా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు పోటెత్తుతోంది. గుట్కాపై రాష్ట్రంలో నిషేధం ఉండటంతో పక్క రాష్ట్రాల నుంచి భారీ మొత్తంలో తీసుకువచ్చి ఇక్కడ విక్రయిస్తున్నారు. విజయనగరం, పార్వతీపురం, బొబ్బిలి, చీపురుపల్లి తదితర ప్రాంతాల్లోని కిరాణ దుకాణాలు పాన్‌షాపులలో గుట్కాలు విచ్చలవిడిగా లభిస్తున్నాయి. ఇక్కడి నుంచి గ్రామీణ ప్రాంతాలకు తరలిస్తున్నారు. అదే విధంగా వివిధ బ్రాండ్లకు చెందిన సిగరెట్లను సైతం భారీమొత్తంలో ఇక్కడకు తరలించి విక్రయిస్తున్నారు. ఈ సిగరెట్లపై పన్ను లేకపోవడంతో అటు అక్రమ రవాణాదారులకు, ఇటు స్థానిక వ్యాపారులకు ఎక్కువ ఆదాయం వస్తోంది. ఛత్తీస్‌గఢ్ నుంచి డ్యూటీలేని మద్యం స్టాకు తీసుకువచ్చి ఇక్కడి మద్యం వ్యాపారులకు సరఫరా చేస్తున్నారు. జిల్లాలోని కొంతమంది మద్యం వ్యాపారులు ఒడిశా, ఛత్తీస్‌గడ్‌లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని వారి సహాయంతో మద్యాన్ని అక్రమంగా తెప్పించుకుని విక్రయిస్తున్నారు.