రాష్ట్రీయం

ఎడమ కాలువకు నీరు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జునసాగర్, ఏప్రిల్ 1: ఎట్టకేలకు నాగార్జునసాగర్ జలాశయం నుండి ఎడమకాలువకు తాగునీటిని శుక్రవారం నాడు డ్యాం అధికారులు విడుదల చేశారు. గురువారం నాడు ప్రకటించినట్లుగానే శుక్రవారం ఉదయం 6:10నిమిషాలకు పొట్టిచెలిమ వద్ద ఉన్న ఎడమకాలువ ప్రధాన ద్వారం నుండి నీటివిడుదలను ప్రారంభించారు. ఎటువంటి అట్టహాసం లేకుండా జెఇ స్థాయి అధికారితో నీటివిడుదలను గావించారు. డ్యాం జెఇ పి.జనార్ధన్‌రావు ఎడమకాలువ రెండవ గేటు ప్రధాన ద్వారం ద్వారా స్విచ్ ఆన్ చేసి నీటివిడుదల ప్రారంభించారు. 500క్యూసెక్కులతో ప్రారంభమై క్రమేణాపెరుగుతూ శుక్రవారం మధ్యాహ్నానికి 5వేల క్యూసెక్కులు, సాయంత్రం వరకు సగటున రోజుకు 6వేల క్యూసెక్కుల చొప్పున విడుదల చేస్తున్నారు. రెండు నెలలుగా ఎడమకాలువకు నీటివిడుదల చేయాలని, అడుగంటిన భూగర్భజలాల శాతాన్ని పెంచాలని, తాగునీటి సమస్యను పరిష్కరించాలని సిపిఎం ఆందోళనలు నిర్వహించినా తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఏప్రిల్ 1వ తేదీనే నీటివిడుదల చేసింది. ప్రస్తుతం సాగర్ జలాశయంలో 508.10అడుగుల నీటిమట్టం ఉంది. సాగర్ జలాశయానికి శ్రీశైలం నుండి శుక్రవారం తెల్లవారుజాము వరకు 2,268 క్యూసెక్కుల నీరు వస్తుండగా శుక్రవారం సాయంత్రం 9024క్యూసెక్కుల నీరు శ్రీశైలం నుండి సాగర్‌కు చేరుకుంటుంది. సాగర్ జలాశయం నుండి కుడికాల్వ ద్వారా 3,011క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బిసి ద్వారా 1200క్యూసెక్కులు, ఎడమకాల్వ ద్వారా శుక్రవారం సాయంత్రానికి 6వేల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలంలో 802.70 అడుగుల నీటిమట్టం ఉంది. అయితే ప్రస్తుతం సాగర్ ఎడమకాల్వ పరిధిలో విడుదల చేస్తున్న నీటిని రోజుకు 6వేల క్యూసెక్కుల చొప్పున వారంరోజులపాటు నీటివిడుదల చేసే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. అయినా ఎడమకాల్వ పరిధిలో ఇన్ని టిఎంసిల నీటిని విడుదల చేస్తాము ఇన్ని రోజులపాటు నీటివిడుదల జరుగుతుందనే విషయంపై డ్యాం అధికారులు పూర్తిస్థాయిలో స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. కాగా మూడున్నర నుండి నాలుగు టిఎంసిల నీటి విడుదల చేయవచ్చని, ఎడమకాల్వ పరిధిలోని ప్రజలు నీటిని వృధా చేయకుండా తాగునీటి అవసరాల నిమిత్తమే వాడుకోవాలని, భవిష్యత్తులో నీటి లభ్యత లేనికారణంగా నీటిని వృధా చేయవద్దని డ్యాం అధికారులు కోరుతున్నారు.
నీటి లభ్యతను బట్టే విడుదల: సిఇ
నాగార్జునసాగర్ జలాశయం దాని ఎగువభాగాన ఉన్న శ్రీశైలం జలాశయంలో ఉన్నటువంటి నీటి లభ్యతను బట్టి ఎడమకాల్వకు నీటివిడుదల చేస్తామని నాగార్జునసాగర్ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ పురుషోత్తంరాజు తెలిపారు. ప్రస్తుతం ఉన్న నీటి లభ్యతను బట్టి ఎడమకాల్వకు తాగునీటి అవసరాల నిమిత్తం రోజుకు 6వేల క్యూసెక్కుల చొప్పున వారం రోజులపాటు నీటివిడుదల చేస్తామని ఆయన తెలిపారు.
చెరువులు నిండేవరకు విడుదల చేయాలి: జూలకంటి
నాగార్జునసాగర్ ఎడమకాలువ పరిధిలోని మంచినీటి చెరువులు, ట్యాంకులు పూర్తిస్థాయిలో నిండేవరకు ఎడమకాలువ ద్వారా నీటివిడుదల చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి కోరారు.