రాష్ట్రీయం

ఎంపిక గోప్యమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: శాసనసభ ఎన్నికల్లో అభ్యర్థుల ప్రకటనలో జరిగిన జాప్యం కూడా ఓటమికిగల కారణాల్లో ఒకటిగా గుర్తించిన కాంగ్రెస్ అధిష్టానం, పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పరిస్థితి పునరావృతం కాకుండా జాగ్రత్త పడుతోంది. పార్లమెంట్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కాకపోయినప్పటికే ప్రస్తుత సభ్యుల కాలపరిమితి మే నెలతో తీరిపోనుండటంతో పోటీకి ఆసక్తి కనబర్చే అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణకు శ్రీకారం చుట్టింది. శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైనప్పటికీ ఉత్తరాది రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ మూడు రాష్ట్రాల్లో గెలుపొందడంతో టిక్కెట్ల కోసం ఎక్కువ మంది పోటీ పడుతున్నారు. పోటీకి ఆసక్తి కనబర్చే అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైనప్పటికీ, ఈ కార్యక్రమం కేవలం నామమాత్రంగానే పార్టీ సీనియర్లు భావిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా బరిలో ఎవరిని నిలిపితే పార్టీకి విజయవకాశాలు మెరుగ్గా ఉంటాయన్నా కోణంలో కాంగ్రెస్ అధిష్టానం రహస్యంగా సర్వే నివేదికలను తెప్పించుకుంటోన్నట్టు తెలిసింది. గోప్యంగా తెప్పించుకున్న సర్వేలతో పాటు పార్టీ పరిశీలకుల నివేదికల ఆధారంగానే అభ్యర్థులను అధిష్టానం ఖరారు చేస్తుందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దరఖాస్తుల స్వీకరణను కేవలం లాంఛనప్రాయంగానే పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. శాసనసభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు వచ్చిన ఓట్లను పరిగణనలోకి తీసుకోవడంతో పాటు స్థానికంగా గట్టిపోటీ ఇచ్చే అభ్యర్థులు ఎవరన్నది అధిష్టానం రహస్యంగా ఆరా తీస్తున్నట్టు సమాచారం. పార్లమెంట్ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికపై పార్టీ పరిశీలకుడు కేసీ వేణుగోపాల్ ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఆరా తీస్తోన్నట్టు సమాచారం. పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే డీసీసీ అధ్యక్షుల నియామకం జరిగినట్టు పార్టీ వర్గాల అంచనా. అభ్యర్థుల ఎంపికపై అధిష్టానం ఇప్పటికే ఒక అభిప్రాయానికి వచ్చినప్పటికీ కసరత్తు చేశాకే ఎంపిక చేసిందన్న సంకేతాలు పార్టీ శ్రేణులకు ఇవ్వడానికే నామమాత్రంగా దరఖాస్తుల స్వీకరణను చేపట్టినట్టు పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.