రాష్ట్రీయం

ఆకర్షణీయంగా తిరుపతి రైల్వేస్టేషన్ అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 10: రోజూ తిరుమల-తిరుపతికి వచ్చే భక్తులతో రద్దీగా ఉన్న తిరుపతి రైల్వే స్టేషన్‌ను ఆధునిక సౌకర్యాలతో పాటు ఆకర్షణీయంగా తీర్చిదిద్దడానికి దక్షిణ మధ్య రైల్వే నిధుల వర్షం కురిపిస్తోంది. నానాటికీ తిరుపతి స్టేషన్‌కు వస్తున్న ప్రయాణీకుల సంఖ్య గణనీయంగా పెరగడంతో వసతులు పెంచాల్సి వస్తోంది. ప్రతిరోజూ తిరుపతి రైల్వే స్టేషన్‌కు దాదాపు 76వేల మంది ప్రయాణీకులు వచ్చిపోతుంటారని రైల్వే అధికారులు లెక్కలు చెబుతున్నారు. రైల్వే బోర్డు ఇప్పటికే తిరుపతి స్టేషన్‌కు ఏ1 కేటగిరీలో చేర్చింది. రైల్వే - టూరిజం సంయక్తంగా నిధులను ఖర్చు చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి. దేశ విదేశాల నుంచి తిరుమలకు వస్తున్న భక్తుల (ప్రయాణీకుల ) కోసం ఫైవ్ స్టార్ హోటళ్ల నిర్మాణానికి ద.మ రైల్వే అధికారులు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ స్టార్ హోటళ్ళ కోసం రూ. 11 కోట్లను వెచ్చిస్తున్నారు. స్టేషన్‌లో 4,5 ప్లాట్ ఫామ్‌లలో ఆధునిక వసతులతో విశ్రాంతి గదులను తీర్చిదిద్దుతున్నారు. ఈ గదులను 1200 చదరపు గజాల్లో నిర్మించనున్నారు. ఇక్కడ ప్రయాణీకులు విశ్రాంతి తీసుకోవడానికి 210 సీట్లతో ఏర్పాట్లు చేస్తున్నారు. విశ్రాంతి రూమ్స్‌లో హైస్పీడ్ వైఫైతో పాటు ఎల్‌ఈడీ టీవీలను ఏర్పాటు చేస్తారు. ఒకటవ ప్లాట్ ఫామ్‌లో ప్రయాణీకుల లగేజీని పెట్టుకోవడానకి 100 చదరపు గజాల విస్తీర్ణంలో క్లాక్ రూమ్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. రద్దీ సమయంలో ప్రయాణీకులు టికెట్ల కోసం తోపులాటలకు అవకాశం ఉన్నందున కొత్తగా టికెట్ బుకింగ్ ఆఫీసులతో పాటు ప్రయాణీకులను అప్రమత్తం చేయడానికి అనౌన్స్ కోసం డిస్‌ప్లే బోర్డులను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కళలకు సంబంధించిన సాంసృత్కిక బొమ్మలతో ఒకటవ ప్లాట్ ఫామ్‌ను సుందరీకరణ చేస్తారు. మహిళల కోసం విశ్రాంతి గదులను కూడా ఏర్పాటు చేస్తారు. స్టేషన్‌ను కొత్త ఆకృతులతో పునరుద్ధణ కోసం రూ 400 కోట్లతో నిర్మాణాలు చేపట్టడానికి టెండర్లు పిలిచారు. ఈ నిర్మాణాల కోసం జాతీయ బిల్డింగ్ నిర్మాణ కార్పొరేషన్ పర్యవేక్షణలో పనులు జరుగుతాయని రైల్వే అధికారులు వెల్లడించారు. టీటీడీ, తిరుపతి పురపాలక సంఘం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుపతి రైల్వే స్టేషన్ పునరుద్ధరణ చేపట్టాలని రైల్వే మంత్రిత్వ శాఖకు లేఖలు రాశాయి.