రాష్ట్రీయం

జాతీయ ప్రాజెక్టులు ఏపీకి మణిహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఫిబ్రవరి 10: ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యాన చేపట్టిన జాతీయ ప్రాజెక్టుకు రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయిలో పేరుప్రఖ్యాతులు తీసుకురావడంతో పాటు మణిహారంగా మారనున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆదివారం గుంటూరులో ఏర్పాటు చేసిన ప్రజాచైతన్య సభకు హాజరైన ప్రధాని మోదీ సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరంలో వివిధ జాతీయ ప్రాజెక్టుల కార్యదర్శులు, యాజమాన్యాలతో సమావేశమయ్యారు. ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి సురేష్‌ప్రభు కూడా హాజరయ్యారు.
ఈసందర్భంగా ఎస్-1 వశిష్ట డెవలప్‌మెంట్ ప్రాజెక్టు, స్ట్రాటజిక్ క్రూడ్ ఆయిల్ స్టోరేజీ ఫెసిలిటీ ప్రాజెక్టులను ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. కృష్ణపట్నం కోస్టల్ ఇనస్టలేషన్‌కు శంకుస్థాపన చేశారు. వీటికి సంబంధించిన శిలాఫలకాలను మోదీ రిమోట్ బటన్ ద్వారా ఆవిష్కరించారు. ఈసందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ప్రపంచమంతా గుర్తించేలా ఎంతో ఆధ్యాత్మిక చరిత్ర, సంస్కృతి ఉన్న గుంటూరును ఆక్స్‌ఫర్డ్ నగరంగా తీర్చిదిద్ది దేశానికి ఆదర్శంగా నిలుపుతామని చెప్పారు. ఎంతో రాజకీయ చరిత్ర ఉన్న గుంటూరు నుంచే వేలకోట్ల రూపాయలతో వినూత్నమైన పథకాలకు శంకుస్థాపన చేశామని, ఈ ప్రాజెక్టుల వల్ల కేవలం ఆంధ్రప్రదేశ్‌కే కాక దేశం మొత్తానికి ప్రధానంగా ఎనర్జీ రంగానికి ప్రాధాన్యత వస్తుందన్నారు. మనం దిగుమతి చేసుకునే పెట్రోల్ కొరత లేకుండా నిల్వ చేసుకునేందుకు కూడా మరిన్ని పథకాలు అమలు చేస్తున్నామని, ఇందులో భాగంగానే కృష్ణపట్నంలో, వైజాగ్‌లోనూ ఆయిల్ రిజర్వ్ కోసం కోస్టల్ టెర్మినల్ ప్రాజెక్టును ప్రారంభించామని చెప్పారు. క్లీన్ ఫ్యూయల్ బేస్డ్ గ్యాస్ ఎకానమీ అనే పథకం ద్వారా వాయు ఆధారంగా పెద్దఎత్తున ఎరువుల తయారీకి శ్రీకారం చుట్టామన్నారు. ఇప్పటికే అసోం రాష్ట్రంలో నార్త్ ఈస్ట్రన్ గ్యాస్ గ్రిడ్‌ను ప్రారంభించామని, కోస్టల్ ప్రాంతాన్ని గ్యాస్ బేస్‌డ్ ఎకానమిగా తీసుకుని పెట్రోలియం హబ్‌గా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అక్షర క్రమంలోనేకాక అన్ని రంగాల్లో ముందుండేందుకు కృషి చేస్తామని, జాతి నిర్మాణంలో గుంటూరుకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. గుంటూరుకు చెందిన వావిలాల గోపాలకృష్ణయ్య, నాయుడమ్మ వంటి ఎందరో స్వాతంత్య్ర పోరాటయోధులు గుంటూరు చెందినవారు కావడం గర్వకారణమన్నారు. హృదయ్ పథకం కింద రాజధాని అమరావతిని హెరిటేజ్ సిటీగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. దేశ ప్రజలందరికీ ఉజ్వల యోజన పథకం కింద 6.25 కోట్ల మందికి ఉచిత గ్యాస్ కనెక్షన్‌లు ఇచ్చామన్నారు. గత 55ఏళ్ల కాంగ్రెస్ పాలనలో కేవలం 12కోట్ల గ్యాస్ కనెక్షన్లు మాత్రమే ఇచ్చారని, తాము నాలుగున్నరేళ్లలోనే 13కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.

చిత్రం.. గుంటూరులో ఆదివారం జరిగిన బహిరంగ సభలో బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ, ప్రధాని మోదీలకు గజమాల వేస్తున్న నేతలు