రాష్ట్రీయం

గోబ్యాక్ నినాదంపై వక్రభాష్యాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 10: గోబ్యాక్ మోదీ అంటూ చేసిన నినాదాలపై ప్రధాని మోదీ వక్రభాష్యాలు చెబుతున్నారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. గుంటూరు సభలో ప్రధాని మోదీ చేసిన విమర్శలపై ఆయన స్పందించారు. గోబ్యాక్ అంటే గోబ్యాక్ గుజరాత్ అని, ఆయన గోబ్యాక్ ఢిల్లీ అన్నట్లు వక్రభాష్యాలు చెబుతున్నారని విమర్శించారు. గోబ్యాక్ ఢిల్లీ అనుకుంటే నవ్వులపాలే అని, గోబ్యాక్ టు గుజరాత్ అవుతుందో, గోబ్యాక్ టు ఫారెస్టు అవుతుందో, గోబ్యాక్ టు హిమాలయాస్ అవుతుందో 2019 ఎన్నికల్లో ప్రజలే తేలుస్తారని ఎద్దేవా చేశారు. ఢిల్లీలో ఉండి దేశాన్ని పాలించే యోగ్యత మోదీకి లేదన్నారు. గుంటూరులో మోదీ ప్రసంగం చూస్తే చంద్రబాబు పట్ల ఉన్న భయానికి నిదర్శంగా ఉందన్నారు. మోదీ 3లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టులు అంటారని, అమిత్‌షా 6లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టులు అంటారన్నారు. ఇవి తప్పుడు మాటలు కావా? అని ప్రశ్నించారు. మోదీ చెప్పిన 3లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టుల చిరునామాలు ఎక్కడని, రాబోయే 10ఏళ్లలో వచ్చే ప్రాజెక్టుల జాబితానా అని నిలదీశారు. తాము చట్టప్రకారం రావాల్సిన ప్రాజెక్టుల గురించి అడుగుతున్నామని, వాటిగురించి మోదీ ఎందుకు నోరు తెరవరన్నారు. విశాఖ రైల్వేజోన్, కడప స్టీల్‌ప్లాంట్, కాకినాడ పెట్రోలియం కాంప్లెక్సు గురించి ఎందుకు ప్రస్తావించలేదన్నారు.
మోదీ, అమిత్‌షా చెప్పేవి అబద్ధాలని, వైకాపా, బీజేపీ నడత దుర్మార్గమన్నారు. రాఫెల్ అవినీతి బురదలో దొర్లుతూ తమపై బురద జల్లుతున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామనే దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ఏపీ, పశ్చిమ బెంగాల్, కర్నాటక, కేరళపై కక్ష సాధిస్తారా? అంటూ నిలదీశారు. ప్రధాని ప్రసంగంలో భయం కనిపిస్తోందని, ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.